సొరియాసిస్- హోమియో వైద్యం

25 Nov, 2014 22:30 IST|Sakshi
సొరియాసిస్- హోమియో వైద్యం

దీర్ఘకాలం పాటు బాధించే చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగానూ, మనసికంగానూ ఎంతో నలిగిపోతున్నారు. అయితే ఈ వ్యాధితీవ్రత రావడానికి గల కారణాలు, రోగి శారీరక మానసిక తత్వశాస్త్రాన్ని అనుసరించి సత్వర పరిష్కారం కోసం హోమియో చికిత్స అందించి సొరియాసిస్‌ను సమూలంగా తొలగించవచ్చు.
 
ఎందుకు వస్తుంది: సొరియాసిస్ దీర్ఘకాలిక చర్మవ్యాధి.  ఇది ఏ వయసులో వారికైన వచ్చే ఆవకాశం ఉంది. శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి వికటించడం వల్ల వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడి చేసినప్పుడు వాటి నుంచి రక్షణ పొందడానికి శరీరంలో తెల్ల రక్త కణాలనే ప్రత్యేక కణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇన్‌ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. దీన్నే వ్యాధి నిరోధక శక్తి అంటాము.

సొరియాసిస్‌లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. చర్మ కణజాలాన్ని అపసవ్య పదార్థంగా అన్వయించుకొని దాడి చేసి, ఇన్‌ఫ్లమేషన్ కలిగిస్తుంది. అయితే వ్యాధి నిరోధక శక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాల వల్ల జరగవచ్చు.

లక్షణాలు: సొరియాసిస్‌లో చర్మంపైన దురదతో కూడిన వెండి రంగు పొలుసులు, పొడలు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపునీ కలిగి ఉండవచ్చు. సొరియాసిస్ మచ్చలు మొదట్లో ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచే కొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. వాటిని తొలగిస్తే రక్తపు చారికలు కనిపిస్తాయి. వాతావరణం చల్లగా ఉండి, తేమ తగ్గిపోయినప్పుడు దురద ఎక్కువగా ఉంటుంది. దీంతో శీతాకాలంలో ఈ సమస్య జఠిలంగా మారుతుంది. కొంత మందిలో అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా వ్యాపిస్తాయి.

రకాలు:  
 1. ప్లేక్ సొరియాసిస్ (తల, మోకాలు, మోచేతుల భాగంలో వస్తుంది)
 2. గట్టేట్ సొరియాసిస్ (గట్టా అనగా బిందువు)  
 3. పస్టులార్ సొరియాసిస్ (చీముతో కూడినది)
 4. ఎరిత్రోడర్మతో సొరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపుదనం ఉండడం)
 
వ్యాధి సోకిన చోట, జాయింట్లలో విపరీతమైన నొప్పి, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమై సొరియాసిస్‌తో బాధపడేవారిలో ఇది కనిపిస్తుంది.
 
చికిత్సవిధానం-హోమియో దృక్పథం
ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్ధాంతంపై హోమియోపతి వైద్య విధానం ఆధారపడి ఉంది. సొరియాసిస్ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి, గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకాలను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా నివారించవచ్చు.

మరిన్ని వార్తలు