హోప్... సక్సెస్!

14 Dec, 2014 00:18 IST|Sakshi
హోప్... సక్సెస్!

వరుస హిట్స్‌తో హుషారు మీదున్న అప్‌కమింగ్ స్టార్ శ్రద్ధాకపూర్... దాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఈ ఏడాది విడుదలైన ‘ఏక్ విలన్, హైదర్’ చిత్రాలు మంచి విజయం సాధించడం... ఈ అమ్మడిలో ఉత్సాహం నింపాయట. 2015 కూడా ఇలాగే దూసుకుపోవాలని కోరుకుంటుందట. ‘వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే గానీ... వాటి కోసం ఆరాటపడను. నాదంతా ప్రవాహం ఎటుంటే అటు కొట్టుకుపోయే మనస్తత్వం. 2014 హ్యాపీ ఇయర్. రాబోయే సంవత్సరం కూడా ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంది శ్రద్ధా. ప్రస్తుతం ఈ లవ్లీ గాళ్ ‘ఏబీసీడీ 2’లో నటిస్తోంది. వరుణ్‌ధావన్ హీరో. వచ్చే ఏడాది మధ్యలో విడుదల అవుతుంది.
 

మరిన్ని వార్తలు