బాద్‌షా సరసన..

18 Dec, 2014 00:40 IST|Sakshi
బాద్‌షా సరసన..

పాకిస్థానీ బుల్లితెర నటి మహిరాఖాన్ నక్క తోక  తొక్కినట్టుంది. టీవీ సీరియల్స్‌తో పాక్‌లో ప్రజాభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది. మొదటి సినిమాలోనే బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ సక్సెస్‌తో ఊపుమీదున్న కింగ్‌ఖాన్ తర్వాతి సినిమా ‘రయీస్’లో ఆయనతో జట్టుకట్టనుంది. ఇన్నాళ్లూ బుల్లితెరతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ పొరుగు దేశపు అందం.. వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌లు చేస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు