ఐ వాంట్ మోర్!

27 Nov, 2014 23:40 IST|Sakshi
హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్‌మన్

ప్రపంచమంతా ఫ్యామిలీ ప్లానింగ్ వైపు అడుగులు వేస్తుంటే... హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్‌మన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నా... తనకు ఇంకా పిల్లలు కావాలంటోందీ తార. ఉన్న నలుగురులో ఇద్దరు మాజీ భర్త టామ్ క్రూజ్‌కు సంబంధించిన సంతానం. మిగిలిన ఇద్దరినీ దత్తత తీసుకుంది. ‘నా సంతానాన్ని ఎనిమిదికి పెంచాలని కోరుకుంటున్నా. మా అమ్మ లాగా నా సోదరికి ఆరుగురు పిల్లలు. అలాగే నాకూ మరో నలుగురు కావాలి’ అని ఎంతో ముచ్చటగా చెప్పింది నలభై ఏడేళ్ల నికోల్ కిడ్‌మన్.
 

మరిన్ని వార్తలు