కియా.. ప్రియా..!

24 Dec, 2014 00:58 IST|Sakshi
కియా.. ప్రియా..!

ఇప్పటి వరకు విదేశాలకు చెందిన సారా, బార్బీ, పుల్లిప్, పుల్లా లాంటి బొమ్మలనే చిన్నారులకు అందించి సంబరపడ్డాం. అయితే ఎక్కడో ఒకచోట మన భారతీయతకు దర్పణం పట్టే భారతీయ బొమ్మ ఉంటే బాగుండేదని సగటు భారతీయునికి అనిపిస్తుంది. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిన అచ్చమైన భారతీయ బొమ్మే ‘కియా’. ఎర్రమంజిల్‌లోని ఎన్‌కేయం గ్రాండ్ హోటల్‌లో మంగళవారం కియా బొమ్మ సృష్టికర్త హిమ శైలజా దాని ప్రాముఖ్యతను వివరించారు.
 
 భారతీయ సంస్కృతిని, చరిత్రను తెలియజేసేలా ఈ బొమ్మను రూపొందించినట్లు ఆమె చెప్పారు. చిన్నారులు ఈ కియా బొమ్మను అమితంగా ఇష్టపడుతున్నారన్నారు. వివిధ రూపాల్లో భారతీయ సంప్రదాయాలకు దర్పణం పట్టేలా తీర్చిదిద్దిన ఈ బొమ్మలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ బొమ్మలను ఆన్‌లైన్ స్టోర్స్‌లోకి విడుదల చేశారు. ఇవి ఆన్‌లైన్ మార్కెట్‌లో మాత్రమే లభ్యమవుతాయన్నారు.
 - సాక్షి, సిటీ ప్లస్ 

మరిన్ని వార్తలు