టూత్ఫేస్టు మధ్యలో నొక్కాడని విడాకులు

5 Jan, 2014 13:47 IST|Sakshi
టూత్ఫేస్టు మధ్యలో నొక్కాడని విడాకులు

చిన్న చిన్న విషయాలకే విడిపోయో దంపతుల సంఖ్య ఎక్కువవుతోంది. అరబ్ దేశం కువైట్లో ఓ మహిళ పెళ్లైన వారానికే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. అయితే ఆమె చెప్పిన కారణం చూసి అంతా అవాక్కయ్యారు. పచ్చి బఠాణీ తినడానికి ఫోర్క్‌కు బదులు బ్రెడ్ ఫోర్క్ వాడారన్న కారణంతో ఆమె విడాకులు కోరడం అందరీని ఆశ్చర్య పరిచింది. తన భర్తకు తినే పద్ధతి తెలియదన్న సాకుతో పతిని వదులుకునేందుకు సదరు మహిళ సిద్ధపడిందని 'గల్ప్ న్యూస్' తెలిపింది. టేబుల్ మ్యానర్స్ లేని  వ్యక్తితో జీవితాంతం కలిసుండలేనని కరాకండీగా చెప్పేసిందట.

మరో మహిళ కూడా తన భర్త నుంచి విడిపోయేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త టూత్ఫేస్టును సక్రమంగా వినియోగించడం లేదన్న కారణంతో ఆమె డైవోర్స్కు దరఖాస్తు చేసింది. టూత్ఫేస్టును చివరి నుంచి కాకుండా మధ్యలో నొక్కి ఫేస్టంతా పాడుచేస్తున్నారనేది ఆమె ఆరోపణ. తన భర్త మొండివాడని, చెబితే వినేరకం కాదని కూడా ఆమె విమర్శించింది.

జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని బాస చేసి ఒక్కటవుతున్న జంటలు చిన్న తగాదాలకే వివాహ బంధాన్ని తెంచుకుంటున్నాయి. ఆధునిక జీవన విధానం, ఆలోచనావిధానంలో వచ్చిన మార్పులు కారణంగా కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కువైట్లో విడాకుల కేసులు 50 శాతం పెరిగాయని విశ్లేషకులు వెల్లడించారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2011లో 6,260 విడాకుల కేసులో నమోదయ్యాయి. అంతుకుముందుతో పోల్చితే ఇది 4.8 శాతం ఎక్కువ. 2010లో 5,972 మంది విడాకులు కోరారు.

కువైట్లో విడాకులు కోరుతున్న వారిలో మహిళలే అధికంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఉన్నత చదువులు చదవిన వనితలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. 25-29 మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా విడాకులు కోరుతున్నట్టు గణంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే  మిగతా దేశాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదంటున్నారు విశ్లేషకులు. తమ స్వేచ్ఛకు భంగం కలిగితే భర్తను వదిలిపెట్టేందుకు ఈ కాలం మహిళలు వెనుకాడడం లేదని వారంటున్నారు.

>
మరిన్ని వార్తలు