లేడీ డీజే.. సిటీ జేజే

20 Nov, 2014 23:26 IST|Sakshi
లేడీ డీజే.. సిటీ జేజే

మరో లేడీ డీజే సిటీకి వస్తోంది. ఈసారి సికింద్రాబాద్‌లోని ఔట్‌స్వింగర్ పబ్ పార్టీ లవర్స్‌ని రాకింగ్ మ్యూజిక్‌తో ఇన్వైట్ చేస్తోంది. మన కంట్రీలోనే లేడీ డీజేలకు కేరాఫ్‌గా మారిన కోల్‌కతా నుంచి వస్తున్న స్నియా... ఇప్పటికే ఇంటర్నేషనల్‌గా పాపులర్. దీంతో ఈ డీజే ఇచ్చే మ్యూజి(కి)క్ ఎలా ఉంటుందోనని సిటీలోని పార్టీ యానిమల్స్ క్రేజీగా వెయిట్ చేస్తున్నారు.
 
నిజానికి న్యూ ఇయర్ జోష్‌కి కిక్ పెంచేందుకు సిటీలోని పార్టీ ప్లేసెస్ అన్నీ టాప్ క్లాస్ లేడీ డీజేలను రంగంలోకి దింపుతాయి. అప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసిన పబ్స్ క్లబ్స్ మేనేజ్‌మెంట్... తరచుగా వారికి రెడ్‌కార్పెట్ వేస్తున్నాయి. ‘అమ్మాయిలు మ్యూజిక్ ప్లే చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీ లవర్స్ మూడ్స్‌ని పట్టడంలో వీరు మరింత స్పీడ్‌గా ఉంటారు’ అని ఓరిస్ హోటల్ బసేరా జనరల్ మేనేజర్ అఖిలేష్ అంటున్నారు.
 
అందుకే నాన్ లోకల్...
డీజేలుగా అమ్మాయిలకు డిమాండ్ బాగానే ఉన్నా... సిటీలో ఉన్నది అరకొరే. అందుకే కోల్‌కత, బెంగుళూరు, ఢిల్లీల నుంచి లేడీ డిజెలను పార్టీ నిర్వాహకులు రప్పిస్తున్నారు. ‘పార్ట్‌టైమ్‌గా చేసేవాళ్లే తప్ప ఫుల్‌టైమ్‌గా డీజేయింగ్ చేయడానికి మన సిటీ అమ్మాయిలు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు’ అని సిటీకీ చెందిన డీజే కోమల్ చెబుతోంది. ఏదేమైనా... లేడీ డీజేలకు పార్టీ సర్కిల్ జేజేలు పలుకుతున్న నేపధ్యంలో... సిటీ అమ్మాయిలు ఈ ట్రెండ్‌ను యూజ్ చేసుకోలేకపోతున్నారనేది సీనియర్ డీజేల మాట.

నేడు స్నియా మాయ
ఔట్ స్వింగర్ పబ్‌లో ‘ఎలక్ట్రానిక్ మాయా’ ఈవెంట్‌లో స్నియా పార్టిసిపేట్ చేస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈట్, డ్రింక్, పార్టీ ఆల్‌నైట్... థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు  నిర్వాహకులు తెలిపారు.

ఎస్బీ
 

మరిన్ని వార్తలు