లాఖోం మే ఏక్

18 Aug, 2014 01:50 IST|Sakshi
లాఖోం మే ఏక్

ఇప్పుడు సిటీలో పేజ్‌త్రీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులంతా తమ చూపును ముంబై మీదే కేంద్రీకరించారు.దీనికి కారణం లాక్మే ఫ్యాషన్ వీక్! ప్రపంచవ్యాప్త మీడియా, టెక్స్‌టైల్, సినీ, గ్లామర్ ఇండస్ట్రీలను ఒకేసారి అటెన్షన్‌లోకి తెచ్చే ఈ ఫ్యాషన్ ఫెస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీ. ఈనెల 20న ముంబైలో ప్రారంభం కానున్న జాతీయస్థాయి డిజైనర్ వార్‌లో పాల్గొనేందుకు లాక్మే ఫ్యాషన్ వీక్‌లోసిటీకి చెందిన నలుగురు ఫ్యాషన్ డిజైనర్లు అవకాశం దక్కించుకున్నారు.                    ..:: ఎస్.సత్యబాబు
 
ప్రపంచంలోని ప్రతిష్టాత్మక  ఫ్యాషన్ ప్రదర్శన లాక్మే ఫ్యాషన్ వీక్ ద్వారా దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించడంతో పాటు బాలీవుడ్‌నీ ఆకట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది. అందుకనే డిజైనర్లు, మోడల్స్, ఇంకా ఫ్యాషన్ పరిశ్రమలోని ఏ విభాగానికి చెందిన వారైనా సరే ఈ షోలో పాల్గొనడాన్ని గొప్ప విజయంగా భావిస్తారు. కొంతకాలంగా భాగ్యనగర సృజనకు లాక్మే రెడ్‌కార్పెట్ పరుస్తోంది.  ముంబయిలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న  డిజైనింగ్ పండుగలో  అరడజను మందిదాకా సిటీ డిజైనర్లు (యాక్సెసరీస్‌తో కలిపి) పాల్గొంటున్నారు.
 
లాక్మే.. లక్ కాదు
దేశవ్యాప్తంగా డిజైనర్లకు ప్రాతినిధ్యం కల్పించే ఈ ‘షో’లో అవకాశం దక్కడం అంత సులభం కాదు. ఈ షోలో పాల్గొనాలంటే కనీసం 18 నుంచి 30 డిజైన్ల వరకూ ప్రత్యేకంగా రూపొందించి నిర్వాహకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అంతేకాదు.. టాప్‌మోడల్స్, షోస్టాపర్స్, ఇంకా సంబంధిత ఖర్చుల కోసం కూడా భారీగా వ్యయం అవుతుంది. అయితే అవకాశం దక్కలేదని వాపోయేవాళ్ల కోసం ఈవెంట్ జరిగే చోట స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వెసులు బాటు కల్పిస్తారు. ఈ నేపధ్యంలో ఈ మెగా ఫ్యాషన్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న నగర డిజైనర్లను పలకరించినప్పుడు... ఇలా స్పందించారు.
 
‘టీ’టైమ్..
గత ఏడాది 2012లో లాక్మే కోసం జెన్ ఎక్స్‌లో  పాల్గొన్నాం. అయితే ఈ సారి విభాగం మారింది.  తొలిరోజే అంటే 20వ తేదీన నా షో ఉంటోంది. నా  కలెక్షన్స్ పేరు ‘టీజమ్’. ఈ కలెక్షన్‌లో ఇండో వెస్ట్రన్ మిక్స్ ఉంటుంది.
 - అర్చనారావు
 
తొలిసారి.. డిజైన్ల తొలకరి
తొలిసారి లాక్మేలో పార్టిసిపేట్ చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే ఉద్వేగంగా కూడా ఉంది. ఈ ప్రదర్శన కోసం చాలా శ్రమిస్తున్నాను. ‘మిల్లె ఫ్లూర్స్’- ఎ థౌజండ్ ఫ్లవర్స్ పేరిట ప్రత్యేక కలెక్షన్‌ను ప్రదర్శిస్తున్నా.  అచ్చమైన అర్బన్ స్టైల్స్‌కు అద్దం పట్టే కలెక్షన్ ఇది.           - నేహ అగర్వాల్
 
శుభాముద్గల్ సంగీతం.. చిత్రసేన ప్రదర్శన
లాక్మేలో పాల్గొనడం అనేది నాకు కొత్త కాదు.  సందర్శకులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతినివ్వడం నా పంథా. నా సరికొత్త కలెక్షన్‌ను  ‘చిత్-్రసేన’ పేరుతో లాక్మేలో ప్రదర్శిస్తున్నా. దీనికి హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జత కలపడం ఈసారి నేను చూపబోతున్న స్పెషాలిటీ. ఈ లైవ్‌మ్యూజిక్‌ను ప్రసిద్ధ గాయని శుభాముద్గల్ ఈ నెల 22న ప్రదర్శిస్తారు. ఇక నా చిత్-్రసేన విషయానికి వస్తే ఇదొక ప్రాచీన-ఆధునికతల  శైలుల అపురూప సంగమం.

పురాతన ఆలయ శిల్పాల నుంచి స్ఫూర్తి పొంది 16వశతాబ్దం నాటి వస్త్ర   ైవె భవాన్ని, 21వ శతాబ్దపు చిత్రకళతో జత చేసి దీన్ని రూపుదిద్దాను. దాదాపు ఆరునెలల కృషి ఫలితమిది. కాంచీపురం చేనేత కళాకారుల పనితనం, అక్కడి కొర్వాయి నేత శైలి ఈ కలెక్షన్‌లో ప్రతిఫలిస్తాయి. నా దుస్తులన్నీ భారతీయ సంప్రదాయం, పురాణాల విశిష్టతకు అద్దం పడతాయి. ఊహించని కలర్ కాంబినేషన్స్, నాణ్యమైన సిల్క్ ఫ్యాబ్రిక్‌కు జర్దోసి ఎంబ్రాయిడరీ అద్దుకున్న ధోతీ, షేర్వానీ.. వంటివి నా కలెక్షన్‌లో కొన్ని మాత్రమే.         
- గౌరాంగ్‌షా

 
ముచ్చటగా మూడోసారి
 గతంలో రెండుసార్లు  లాక్మేలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇది మూడోసారి. అయితే ఈ సారి ఇండియన్ టెక్స్‌టైల్‌కు సంబంధించి సౌతిండియా నుంచి ఎంపికైన ఏకైక డిజైనర్‌ని కావడం సంతోషంగా ఉంది. ఈ నెల 21న ఇండియన్ టెక్స్‌టైల్ డే
పేరిట జరిగే షోలో డిజైన్లను ప్రదర్శించనున్నాను. కళంకారి, పోచంపల్లి, ఇకత్ చేనేతల పనితనాన్ని చూపడం నా ప్రత్యేకత. ఇది వింటర్ సీజన్. అందుకే ఖాదీని వింటర్‌కు సైతం నప్పే చక్కని ఫ్యాబ్రిక్‌గా చూపబోతున్నా. ‘సపరేట్స్’ పేరిట నేను ప్రదర్శించే కలెక్షన్‌లో గాగ్రా, కుర్తా, స్టోల్, స్కర్ట్స్, జాకెట్స్, డ్రెసెస్, శారీస్ ఉంటాయి. కుర్తా, ప్యాంట్ ఇలా దేనికదే సెపరేట్‌గా  కొనుగోలు చేయవచ్చు. మొత్తం 16 నుంచి 18 గార్మెంట్స్ చూపిస్తున్నా.      - శశికాంత్ నాయుడు

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా