ఫ్యాషన్ ‘ఉష’స్సు

3 Jul, 2015 00:03 IST|Sakshi
ఫ్యాషన్ ‘ఉష’స్సు

ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్, ప్రథమ మహిళా పైలట్ ఉషా రఘునాథన్.. మరోమారు నగరానికి వచ్చారు. ఆమె తాజాగా డిజైన్ చేసిన దుస్తుల కలెక్షన్స్‌ను బంజారాహిల్స్ రోడ్‌నెం.1లోని సింఘానియాస్ బొటిక్‌లో గురువారం లాంచ్ చేశారు. ఇదే తన చివరి కలెక్షన్ అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, జీవితానికి ఏదీ చివరిదంటూ ఉండదని, తాను తొలుత పైలట్‌గా కెరీర్ ప్రారంభించి డిజైనర్ దాకా ఎన్నో రకాల ప్రొఫెషన్స్‌ను ఎంజాయ్ చేశానని చెప్పారు.

భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పర్యటించడమే తన లక్ష్యమన్నారు. రేఖ, హేమమాలిని, జయాబచ్చన్, షబానా అజ్మీ... వంటి ప్రముఖులు ఇష్టపడే సంప్రదాయ వస్త్రశైలులు అందించిన ఉషా రఘనాథన్ తమ బొటిక్‌లో కలెక్షన్ లాంచ్ చేయడం ఆనందదాయకమని, బ్లౌజ్‌లు, పట్టు చీరలు, సిల్క్-కాటన్ మిక్స్ చీరలు.. ఉష కలెక్షన్‌లో ఉన్నాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి.
 

మరిన్ని వార్తలు