లేటెస్ట్ టెక్నాలజీతో హ్యాండ్‌బ్యాగులు

24 Nov, 2014 23:04 IST|Sakshi
లేటెస్ట్ టెక్నాలజీతో హ్యాండ్‌బ్యాగులు

మగువల భుజాన్ని అంటిపెట్టుకుని ఉంటూ.. వారి అవసరాలన్నీ తీర్చే నేస్తం హ్యాండ్‌బ్యాగ్. మనీ, మొబైల్‌ఫోన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, హెయిర్ బ్రష్.. ఇలా ముదితలకు చెందిన ముఖ్యమైన వస్తువులను అపురూపంగా మోస్తుంది. తమకు కావాల్సినవన్నీ మోసే హ్యాండ్‌బ్యాగ్స్‌ను యువతులు కూడా అంతే అపురూపంగా చూసుకుంటుంటారు. మార్కెట్‌లోకి కొత్త మోడల్ రాగానే సొంతం చేసుకుంటారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా నయా మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు డిజైనర్లు.    

..:: శిరీష చల్లపల్లి

ఒకప్పుడు కాలేజ్ గాళ్స్.. సబ్జెక్ట్‌కో నోట్‌బుక్, జామెట్రీ బాక్స్, టిఫిన్ బాక్స్.. వాటర్ బాటిల్.. ఇలా స్టేషనరీని వెంటేసుకుని కాలేజీకి వెళ్లేవారు. వీటన్నింటినీ మోసే బ్యాగ్‌ను భుజాలకుతగిలించుకుని భారంగా నడిచేవాళ్లు. ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఇంటర్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ వరకూ అందరూ హ్యాండ్‌బ్యాగ్ లేనిదే గడప దాటడం లేదు. వారి వారి అవసరాలకు తగ్గట్టుగా రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
రకరకాలు..
కొత్త హంగులతో ముస్తాబై వస్తున్న బ్యాగులను మగువలు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతులే కాదు..అమ్మలు.. అమ్మమ్మలు కూడా ఏజ్‌కు తగ్గట్టుగా హ్యాండ్‌బ్యాగ్‌లు మెయింటేన్ చేస్తున్నారు. డాక్టర్ బ్యాగ్, బో బ్యాగ్, క్రాస్ బాడీ బ్యాగ్, రిస్లెట్ బ్యాగ్, మెసెంజర్ బ్యాగ్, క్లచ్ బ్యాగ్, బ్యారెల్ బ్యాగ్, డ్రాస్ట్రింగ్ బ్యాగ్, సాడిల్ బ్యాగ్, స్ట్రక్చర్డ్ బ్యాగ్, టోటె బ్యాగ్ ఇలా రకరకాల బ్యాగ్‌లు టీనేజ్ అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ ఎవరికి వారే ఫంక్షన్‌లలో స్టయిల్ ఐకాన్‌గా నిలవడానికి ప్రయత్నిస్తున్నారు.

మ్యాచింగ్ మస్ట్..
టీనేజ్ అమ్మాయిలైతే ఎక్కువగా స్లింగ్ బ్యాగులు, టోటే బ్యాగులను ఎంచుకుంటున్నారు. కాలేజీ అమ్మాయిలైతే సింగిల్ హ్యాండ్‌తో వాళ్ల డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే హ్యాండ్‌బ్యాగ్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. రెండు నోట్‌బుక్‌లు, మొబైల్ ఫోన్, పెప్పర్ స్ప్రే ఇమిడిపోయేవి తీసుకుంటున్నారు. లైట్‌వెయిట్ హ్యాండ్ బ్యాగ్‌లతో ఫెమినిన్‌గా, క్యూట్‌గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు.

ట్రెండ్‌కు తగ్గట్టుగా..
నయా పోకడలతో అప్‌డేట్ అవుతున్న డిజైనర్లు సైతం రకరకాల మెటీరియల్స్‌తో హ్యాండ్‌బ్యాగులు తయారు చేస్తున్నారు. డ్రెస్‌లు డిజైన్ చేసినట్టే హ్యాండ్‌బ్యాగ్‌లను కూడా కస్టమైజ్డ్‌గా తీసుకొస్తున్నారు. లెదర్, క్లాత్, జ్యూట్, ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్ వాడుతున్నారు. డబుల్ జిప్, మల్టీ జిప్, క్లచ్ మోడల్ ఇలా వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ వేటికవే స్పెషల్ లుక్‌తో అదరగొడుతున్నాయి.

సేఫ్టీ లాకింగ్..
సేఫ్టీ కోసం హ్యాండ్‌బ్యాగ్స్‌కు సైతం లాకింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తున్నారు డిజైనర్లు. నంబర్ లాకింగ్, మినీ కీ లాక్, అలారం బేస్డ్ ఇలా రకరకాల లాకింగ్ సిస్టమ్స్ అటాచ్ చేస్తున్నారు. అంతెందుకు జీపీఎస్ టెక్నాలజీని కూడా హ్యాండ్‌బ్యాగ్‌లకు అడాప్ట్ చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లో ఎలక్ట్రానిక్ చిప్ అరేంజ్ చేస్తున్నారు. దీంతో పొరపాటున హ్యాండ్‌బ్యాగ్ అన్ అథెంటిక్ పర్సన్‌గానీ ఓపెన్ చేశాడంటే.. సదరు హ్యాండ్‌బ్యాగ్ ఓనర్ మొబైల్‌కు, ముందుగా అందులో ఫీడ్ చేసిన మొబైళ్లకు సమాచారం అందుతుంది. తస్కరణకు గురైన మీ హ్యాండ్‌బ్యాగ్ ఏ ఏరియాలో ఉందో కూడా చూపిస్తుంది. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో ముస్తాబైన హ్యాండ్‌బ్యాగులు మార్కెట్‌లో అదరగొడుతున్నాయి.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా