లిటిల్ కలర్స్

5 Aug, 2014 01:04 IST|Sakshi
లిటిల్ కలర్స్

ఇవేవో పేరుమోసిన కుంచెల్లో నుంచి జాలువారిన చిత్రరాజాలు కావు.. ఐదేళ్ల చిన్నారి చిట్టి చేతులు రంగరించిన కమనీయ దృశ్యాలు. గర్జించే మేఘం.. వర్షించే చినుకు.. హిమవన్నగం ఇలా ప్రకృతి ఏదైనా.. అదితి అపురూప చిత్రంగా మార్చేస్తుంది. కంటికి ఇంపుగా కనిపించిన ప్రతీదీ క్షణాల్లో ఈ చిన్నారి కాన్వాస్‌పై ఒదిగిపోతుంది. యూకేజీ చదువుతున్న అదితి అమరవాది ప్రవాస భారతీయులు డాక్టర్ కమలాకర్, కవితల గారాల పట్టి.
 
  మూడేళ్లకే మునివేళ్లతో బొమ్మలు గీయడం ఆరంభించింది. ఇటీవల తల్లిదండ్రులతో కలసి అదితి హైదరాబాద్ వచ్చింది. ఆ చిన్నారి గీసిన చిత్రాలను చూసిన వారంతా మురిసిపోయారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ట్ గ్యాలరీలో అవే చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రారంభించారు. గ్యాలరీలో కొలువుదీరిన అదితి గీసిన అందాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.        
 - నాంపల్లి

మరిన్ని వార్తలు