ఆయన గ్యారేజ్‌లో ఆరు రోల్స్‌ రాయిస్‌ కార్లు..

4 Feb, 2019 20:48 IST|Sakshi

లండన్‌ : రోల్స్‌ రాయిస్‌ కారును సొంతం చేసుకోవాలనుకునే కల చాలామందికి కలగానే మిగిలిపోతుంది. బ్రిటన్‌లో స్ధిరపడిన భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రూబెన్‌ సింగ్‌ మాత్రం ఏకంగా 15 రోల్స్‌ రాయిస్‌ లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నాడు. సింగ్‌ ఇటీవల రూ 50 కోట్లకు పైగా వెచ్చించి ఆరు రోల్స్‌ రాయిస్‌ లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఇటీవల లాంఛ్‌ అయిన మూడు ఫాంటాన్‌ లగ్జరీ సెడాన్‌లున్నాయి.

లండన్‌లో ఫైనాన్షియల్‌ కంపెనీని నిర్వహించే రూబెన్‌ సింగ్‌ ఇటీవల తాను కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సింగ్‌ పోస్ట్‌ చేసిన రోల్స్‌ రాయిస్‌ కలెక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. రోల్స్‌ రాయిస్‌ కార్లతో పాటు ఆయనకు బుగాట్టి వెరైన్‌, పోర్షే 918, సైడర్‌, పగాని హుయర, లంబోర్గిని హరికేన్‌, ఫెరారి ఎఫ్‌ 12, బెర్లినెట్టా పరిమిత ఎడిషన్‌ (ప్రపంచంలో ఒకే ఒక్క వాహనం) వంటి పలు లగ్జరీ కార్లున్నాయి. రూబెన్‌ సింగ్‌ బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు చిన్న పరిశ్రమలు, కాంపిటీటివ్‌ కౌన్సిల్‌పై ప్రభుత్వ సలహామండలిలో సభ్యుడిగా పనిచేశారు. గతంలోనూ బ్రిటన్‌ ప్రభుత్వంలో ఆయన పలు పదవులు నిర్వహించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షీ ఇన్‌స్పెక్టర్‌

అలల ఫ్యాక్టరీతో విద్యుత్‌ ఉత్పత్తి...

మాస్టర్‌ స్విచ్‌ను  కనుక్కున్నారా?

ఆమెకు కులం, మతం లేదు!

ఐరన్‌ లేడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?