లుక్ పర్‌ఫెక్ట్

12 Dec, 2014 00:36 IST|Sakshi
లుక్ పర్‌ఫెక్ట్

‘ఖర్చెంతైనా పర్లేదు... అందంగా కనిపించాలంతే’... వెండి తెరపై వెలిగిపోయే తారలే కాదు... పెళ్లిళ్లు, పార్టీలకు అటెండయ్యే కామన్ పీపుల్ ట్రెండ్ కూడా ఇదే.. జస్ట్ లుక్ పర్‌ఫెక్ట్. అమ్మాయి అయినా... అబ్బాయి అయినా... ఫీల్డ్ గ్లామరైనా... కాకపోయినా... ఏజ్ ఏదైనా... గ్లామరస్‌గా కనిపించాలంతే. హైటెక్ సిటీలో ఇప్పుడు బ్యూటీ థాట్ ఎక్కువైపోయింది. అందుకు తగ్గట్టుగానే సిటీజనులను అందంగా తీర్చిదిద్దేందుకు బ్యూటీ సెలూన్లు, స్పాలు పుట్టుకొస్తున్నాయి.
 - వీఎస్
 
రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల వంటివారు కూడా సినీ తారల్లా అందంగా కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. శుభకార్యాలు, ఫ్రెండ్‌షిప్ పార్టీలు, కాలేజీ ఫంక్షన్లు... అకేషన్ ఏదైనా... అప్పీయరెన్స్‌లో అందరి కాన్సెప్ట్ ఒక్కటే... లుక్ బ్యూటిఫుల్. ఇలాంటి వారి అభిరుచికి తగ్గట్టుగానే బ్యూటీ స్పాలు సేవలందిస్తున్నాయి. ట్రెండ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకొంటూ... అవసరమైతే విదేశాలకు వెళ్లిమరీ శిక్షణ తీసుకుని మరీ విభిన్న ప్యాకేజీలు అందిస్తున్నాయి. నగరవాసులను కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాయి.
 
ఇవి అందించే సర్వీసుల్లో ముఖ్యమైనవి... హెయిర్, స్కిన్, బాడీ కేర్, బాడీ వ్యాక్సింగ్, నార్మల్ మేకప్, బ్రైడల్ మేకప్, టాటూలు... ఇలా లేటెస్ట్‌స్టైల్స్‌కు సిటీజనులను కేరాఫ్‌గా మార్చేస్తున్నాయి. స్పెషల్ మేకప్‌ల కోసం గతంలో ముంబై, ఢిల్లీల వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు... వాటిని తలదన్నేలా హైదరాబాద్‌లోనే విభిన్నమైన సెలూన్లు వెలిశాయి. సినిమా తారలు మరిన్ని వన్నెలద్దుకొనేందుకు వీటి ముందు క్యూ కడుతున్నారు.
 
ట్రెండ్‌కు తగ్గట్టుగా...
ప్రస్తుతం సిటీలో బ్యూటీ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. మా సెలూన్‌కు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వస్తుంటారు. అలాగే సామాన్యులు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. 2000లో రెండే కుర్చీలతో మా ఇంట్లో ప్రారంభించిన సెలూన్... ఇప్పుడు పలు బ్రాంచీలతో విస్తరించింది.
 
బయటి ప్రాంతాల నుంచి నిపుణులను తెచ్చుకోవడం కంటే... ఇక్కడున్నవారికి బ్యూటీషియన్ కోర్సులు నేర్పించాలని ఏడాదిన్నర క్రితం అకాడమీ కూడా ప్రారంభించా. ఇక్కడ శిక్షణ తీసుకున్న చాలా మంది నేడు భారీ వేతనాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల స్పా కూడా నెలకొల్పాం. తద్వారా... ట్రెండ్‌కు తగ్గట్టుగా నగరవాసులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది.
 - డాక్టర్ విజయలక్ష్మి గూడపాటి, మిర్రర్ సెలూన్స్ అండ్ అకాడమీ డెరైక్టర్

మరిన్ని వార్తలు