మోడరన్ పడక్కుర్చీ!

28 Jun, 2013 02:59 IST|Sakshi
మోడరన్ పడక్కుర్చీ!
తాతయ్య పడక్కుర్చీ... పెదనాన్న వాలు కుర్చీ... తరం మారిన తర్వాత ఇప్పుడు మోడరన్ రీక్లెయినర్. రోజంతా పనులతో అలసిపోయిన తర్వాత ఇంటికొచ్చి కదలకుండా కుర్చీలో కూర్చోవడమూ ఓ శిక్షగానే అనిపిస్తుంది. అలాగని ఏడింటికే పడక మీద మేను వాల్చడమూ కుదరదు. అందుకే ఈ రెండింటికీ మధ్యస్థంగా ఓ సుఖాసనం కావాలి. అది అలసట నుంచి సేదదీర్చాలి, వెన్నుకు ఊతంగా ఉండాలి. మంచి నవల చదువుతూ సెలవు రోజుని ప్రశాంతంగా, విశ్రాంతిగా గడిపేయాలనే వారికి సౌకర్యంగా ఉండే ఊయలలాంటి సాధనమేదో కావాలి, అదే రీక్లెయినర్.
 
రెడీమేడ్ రీక్లెయినర్‌ని కొనడం ఒక పద్ధతి, చెక్కతో మనకు కావల్సిన మోడల్‌లో చేయించుకోవడం మరో పద్ధతి. విశాలమైన గది ఉంటే ఏ సమస్యా ఉండదు, కానీ చిన్న గదుల ఇంట్లో వీటికి స్థలం పెద్ద సమస్యే. దీనిని ఇంటికి తెచ్చాక ఎక్కడ పెట్టాలా అని చోటు కోసం చూస్తే కష్టం. ముందుగానే గదిలో ఒక ప్రదేశాన్ని చూసుకుని కొలతలు తీసుకుని చేయించుకుంటే మంచిది. ఇవన్నీ కాదు టూ ఇన్ వన్ లాగ పని జరిగిపోవాలంటే మాత్రం... సోఫా కమ్ రీక్లెయినర్‌లు తీసుకోవాల్సిందే. సోఫాకి ఒక పక్కన కీ బటన్ ఉంటుంది. దానిని తిప్పితే ఫుట్ రెస్ట్ పైకి లేచి రీక్లెయినర్‌గా మారుతుంది. ఉదయం సోఫా, సాయంత్రానికి రీక్లెయినర్ అన్నమాట!
మరిన్ని వార్తలు