మదర్స్ సెయిలింగ్

7 Jul, 2014 00:40 IST|Sakshi
మదర్స్ సెయిలింగ్

అమ్మ ఎప్పుడూ అద్భుతం. అంతుపట్టని పజిల్. లోకం అంతా తన చుట్టూనే తిరుగుతున్నా తను మాత్రం పిల్లలే లోకంగా బతుకుతుంది. పిల్లల కోసం ఇష్టాలు, అభిరుచులు, చివరకు కెరీర్ కూడా వదులకుంటుంది. ఈ ఇద్దరమ్మలు అందరికన్నా భిన్నం. చిన్నప్పుడు బిడ్డలకు ఆట బొమ్మలైన వారు... ఇప్పుడు వాళ్ల కోసమే ఆటలు నేర్చుకుంటున్నారు. సెయిలింగే తమ లైఫ్ అనుకున్న పిల్లల కోసం లైఫ్ జాకెట్స్ ధరించారు. సాహసంతో ఏటికి ఎదురీదుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన సెయిలింగ్ పోటీల్లో తమ పిల్లలతో పాటూ పాల్గొన్న జినా, నిపా అషర్‌ల అమ్మ మనసు వారి మాటల్లోనే...
 -  వాంకె శ్రీనివాస్
 
 ‘మేం కొంపల్లిలో ఉంటాం. పాప జుహీ, వాటర్ స్పోర్ట్స్ తనిష్క్ దేశాయ్‌కి వాటర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. అందుకే మూడేళ్ల నుంచి సెయిలింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. వారి శిక్షణ కోసం ప్రతి శని, ఆదివారాలు హుస్సేన్‌సాగర్‌కి తీసుకొచ్చేవాళ్లం. అప్పుడు కోచ్ ‘మీరూ నేర్చుకోండి’ అన్నారు. ఆ క్లబ్‌లో జుహీ ఒక్కతే అమ్మాయి కావడంతో, తనకూ ధైర్యంగా ఉంటుంది, కష్టనష్టాలేంటో తెలిసినట్టుగా ఉంటుందని భావించి నేనూ సెయిలింగ్ ప్రాక్టీసు చేశా. ఈ సమయంలో ఆటలంటే అంతా వింతగా చూస్తారు. కానీ నా భర్త నితిన్ దేశాయ్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారు.
 
 అలా 2012, 2013, ప్రస్తుతం మాన్‌సూన్ రెగెట్టాలో ఫ్యామిలీ ఈవెంట్‌లో పాల్గొన్నా. అయితే గత పోటీల్లో వయసు సరిపోక జుహీ పార్టిసిపేట్ చేయులేదు. ఈసారి తనతోపాటు నేనూ పోటీ పడ్డా. ఇదో అద్భుతమైన అనుభూతి నాకు. సెరుులర్‌గా వూరతానని ఎన్నడూ ఊహించలేదు. ఇక బాబు 15 ఏళ్ల తనిష్క్ కూడా సెరుులింగ్‌లో తన విన్యాసాలతో అబ్బురపరుస్తున్నాడు. పిల్లలిద్దరూ సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. భవిష్యత్‌లో వీరిని వరల్డ్ చాంపియన్‌లుగా చూడాలన్నది నా ఆశ’ అంటూ ఆనందంగా చెప్పారు జినా.  
 
 జినాలాగే తన పిల్లలకోసం సెయిలర్‌గా మారిన మరో తల్లి... ముంబైకి చెందిన నిపాఅషర్. ‘మా పాప అనియా ముంబైలోని ఏవీఎన్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. తనకు సెయిలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. అంత చిన్నవయసులో ఒంటరిగా పంపించడమా అని భయమేసింది. నా భర్త మహుల్‌అషర్ కూడా సెయిలర్. అయినా పాప కోసం నేనూ సెయిలింగ్ నేర్చుకున్నా. ప్రస్తుతం పదేళ్లు ఉన్న అనియా హుస్సేన్‌సాగర్‌లో జరిగిన మాన్‌సూన్ రెగెట్టాలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. వుంచి సెరుులర్ అవుతుందనే నవ్ముకం ఉంది’ అని ధీవూ వ్యక్తం చేశారు అషర్.

మరిన్ని వార్తలు