మౌత్‌ వాష్‌తో డయాబెటిస్‌

23 Nov, 2017 15:38 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:రోజుకు రెండు సార్లు మౌత్‌ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకుంటే డయాబెటిస్‌ వచ్చే ముప్పు 50 శాతం అధికమని తాజా పరిశోధనలో తేలింది. రోజుకు ఒకసారి అసలు మౌత్‌వాష్‌ చేసుకోని వారితో పోలిస్తే వీరికి టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్క్‌ పొంచిఉందని హెచ్చరించింది. మౌత్‌ వాష్‌ చేసుకుంటే నోటిలోని చెడు బ్యాక్టీరియాతో పాటు డయాబెటిస్‌, ఒబెసిటీల నుంచి మనల్ని రక్షించే మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందని అమెరికన్‌ పరిశోధకుల తాజా అథ్యయనం వెల్లడించింది. మౌత్‌వాష్‌ ఫార్ములాలన్నింటిలో చెడు, మంచి బ్యాక్టీరియాలను ధ్వంసం చేసే యాంటీ బ్యాక్టీరియల్‌ పదార్ధాలుంటాయని అథ్యయనానికి నేతృత్వం వహంచిన హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ప్రొఫెసర్‌ కౌముది జోషిరుర తెలిపారు.

ఈ మౌత్‌ వాష్‌లు నిర్ధిష్ట బ్యాక్టీరియాపై పనిచేయకుండా మొత్తం బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం కలిగిఉంటాయని చెప్పారు. నోటిలో ఉన్న కొన్ని బ్యాక్టీరియాలు డయాబెటిస్‌, ఒబెసిటీ రిస్క్‌ నుంచి కాపాతాయని గత ఏడాది పీరియోడాంటల్‌ రీసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది.

మరిన్ని వార్తలు