రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌

25 Oct, 2017 10:32 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించే క్రమంలో రైల్వేలు సరికొత్త వెబ్‌సైట్‌ను లాంఛ్‌ చేయనున్నాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మలుచుకునేందుకు వేగంగా,సులభంగా టికెట్లు బుక్‌ చేసుకునేందుకు అనువుగా ఆండ్రాయిడ్‌ ఆధారిత ఐఆర్‌సీటీసీ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త వెబ్‌సైట్‌ ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటూ ఈజీ లాగిన్‌, నేవిగేషన్‌ సౌకర్యాలను అందిస్తుంది. టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో టైమ్డ్‌ అవుట్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది.

ఇతర ట్రావెల్‌ వెబ్‌సైట్లు, యాప్స్‌ నుంచి పోటీని తట్టుకుంటూ కొత్త వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా పెద్ద ఎత్తున రాబడి పెంచుకోవాలని రైల్వేలు యోచిస్తున్నాయి. కన్‌ఫర్మ్‌ అయిన టికెట్ల డిస్‌ప్లే, డేటా ఎనలిటిక్స్‌ ద్వారా ప్రయాణ తేదీలను ఖరారు చేసుకోవడం వంటి కొత్త ఫీచర్లను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. రైళ్ల రాకపోకలను రియల్‌టైమ్‌ ప్రాతిపదికన ప్రయాణీకులకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల ద్వారా చేరవేసేందుకూ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి.

ప్రయాణ సమయంలో జాప్యం, జాప్యానికి కారణాలు, తదుపరి స్టేషన్‌కు రైలు చేరే సమయం వంటి వివరాలను ప్రయాణీకుడి మొబైల్‌కు టెక్స్ట్‌ అలర్ట్‌లు పంపాలని రైల్వేలు భావిస్తున్నాయి. రైలు ఎక్కడ ఉన​‍్నదనే వివరాలను ఇస్రో సాయంతో శాటిలైట్‌ల ఆధారంగా ప్రయాణీకులకు చేరవేసేలా నూతన ఫీచర్లనూ అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని వార్తలు