టైర్లను కొత్త కొత్త డిజైన్లతో

18 Jul, 2013 03:31 IST|Sakshi
టైర్లను కొత్త కొత్త డిజైన్లతో
 ప్రకృతిలో కొన్ని వస్తువులు పాతపడినకొద్దీ వాటి అందం రెండింతలు, మూడింతలు అలా అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఆ కోవలోకి చెందినవే పాత టైర్లు. సైకిళ్లు,  బైక్‌లు, కార్లు, జీపులు.. అరగదీసిన టైర్లను ఓ మూలన పడేశారా! అయితే వాటికి అంటుకున్న మట్టిని దులిపి, కొత్తగా రంగులేసి, పూల మొక్కలు పెట్టేసి గోడలకు వేలాడదీయండి. లేదంటే చెట్టుకొమ్మలకు కట్టేయండి. అదీ కాదంటే ఇంకాస్త చక్కగా శుభ్రపరిచి మెత్తని కుషన్లు పరిచి, ఆసీనులుకండి. సీన్.. భలే బాగుందే అని చూసిన వారందరూ మెచ్చుకోకపోతే అప్పుడు అడగండి టైర్ క్రాఫ్ట్ వారిని. కొత్త కొత్త డిజైన్లతో టైర్లకు వారు అద్దిన సొబగులు ఇవి.
 
మరిన్ని వార్తలు