దక్కన్ ఉత్తర్

30 Oct, 2014 01:04 IST|Sakshi
దక్కన్ ఉత్తర్

భాగ్యనగరంలో ఉత్తరాది పరిమళం గుబాళించింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు, నగరంలోని ఇతర చెరువులు పుష్కరఘాట్‌లను తలపించాయి. ఉత్తర భారతీయులు భక్తి శ్రద్ధలతో చేసుకునే ఛఠ్ పూజ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఏటా కార్తీక శుద్ధ షష్టి రోజు జరిగే ఈ వేడుకులో నగరంలో స్థిరపడిన ఉత్తరాదివాసులు ఉత్సాహంగా పాల్గొంటారు. సూర్యాస్తమయ సమయంలో ప్రత్యక్ష నారాయణుడికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు ఉపవాస దీక్ష చేపడతారు. ఈ రోజు సూర్యోదయం తర్వాత  ఆదిత్యుడికి మళ్లీ పూజలు చేసి దీక్షను విరమిస్తారు.

మరిన్ని వార్తలు