ఇక పిల్లుల వయ్యారాలు

5 Mar, 2015 00:27 IST|Sakshi
ఇక పిల్లుల వయ్యారాలు

డాగ్ షోస్ ఓకే..! వాటి వయ్యారి నడకలు సిటీకి కొత్తేమీ కాదు. మరి దాదాపు ప్రతి ఇంట్లో కామన్ అయిన పిల్లుల మాటేమిటి! అలా అలా తమ సొగసిరులను ఒలికించి మురిపించేందుకు తమకూ ఓ వేదిక కావాలనుకోవూ! అదే ఆలోచన వచ్చినట్టుంది మార్స్ ఇంటర్నేషనల్, ఇండియన్ క్యాట్ ఫెడరేషన్, వరల్డ్ క్యాట్ ఫెడరేషన్‌లకు. అందుకే సిటీలో తొలిసారిగా ‘ఇంటర్నేషనల్ క్యాట్ షో ఆఫ్ ఇండియా’ నిర్వహించేందుకు రెడీ అయిపోయాయి ఈ సంస్థలు. ఈ నెల 8 ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ షో వివరాలను ఇండియన్ క్యాట్ ఫెడరేషన్, మార్స్ ప్రతినిధులు నాయర్, ఉమేష్ బుధవారం వెల్లడించారు.
 
 సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... ఇంతకుముందు బెంగళూరు, ముంబైల్లో ఈ పోటీలు జరిగాయన్నారు. సిటీలో ఇదే తొలిసారని, ఆరు విభాగాల్లో పోటీలుంటాయని చెప్పారు. వంద పిల్లులకు మాత్రమే ఈ షోలో పోటీపడే అవకాశం ఉంది. పోటీ రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా విదేశీ పిల్లులను ప్రదర్శించారు. ప్రవేశం ఉచితం. వివరాలకు www.indiancatfederation.org లో సంప్రదించవచ్చు.
-  పంజగుట్ట

మరిన్ని వార్తలు