కిల.. కిల.. కిల

7 Jan, 2018 02:44 IST|Sakshi

ఏటా పక్షులు ఓ చోటు నుంచి మరో చోటుకు వలస వెళ్తుంటాయి. అది వాటికి అవసరం.. ఆవశ్యకం. మనకు మాత్రం ఆహ్లాదం. అవి అలా గుంపులు గుంపులుగా ఆకాశంలో వెళుతూ సందడి చేస్తుంటే మనసుకు అదో ప్రశాంతత. అయితే అక్కడితోనే ఆగిపోకుండా ఓ ఫొటోగ్రాఫర్‌ పక్షుల వలసలో కూడా సృజనాత్మకతను వెలికి తీశాడు. జర్మనీకి చెందిన డేనియల్‌ బైబర్‌ వేలాది పక్షులు మరో పక్షి ఆకారంలోకి మారినప్పుడు ఈ అద్భుతమైన ఫొటోలను క్లిక్‌మనిపించాడు. ఈశాన్య స్పెయిన్‌లోని కోస్ట్రాబావాలో నాలుగు రోజుల పాటు కష్టపడి ఈ అద్భుతాలను ప్రపంచానికి అందించాడు.

మరిన్ని వార్తలు