ఐఓఎస్‌పైవైవిధ్యమైన వినోదం...

4 Jul, 2013 04:30 IST|Sakshi
ఐఓఎస్‌పైవైవిధ్యమైన వినోదం...
 ఐఓఎస్‌పై గేమ్ అప్లికేషన్‌లతోనే బోర్ కొడుతోందనుకునే వారికి కాస్త వైవిధ్యమైన వినోదానికి ఒక మార్గం ‘పిక్సల్‌క్విజ్’. ఇది మీకు ఆసక్తికరమైన నాలెడ్జిని పెంపొందిస్తూ వినోదాన్ని అందిస్తుంది. మీకు సినిమాల మీద ఉన్న పట్టు ఎంత, మీ ఫేవరెట్ టెలివిజన్ షో, మ్యూజిక్ బ్యాండ్స్ మీద ఉన్న కమాండ్ ఎంత? అనేది తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్ క్విజ్ పెడుతుంది. వాటి గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసుననే ఫీలింగ్, ఇలాంటి టాపిక్‌ల విషయంలో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మీకు పిక్సల్‌క్విజ్  అప్లికేషన్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది. ఐఓఎస్‌పై పనిచేసే ఈ అప్లికేషన్ ఇంకా పాపులర్ కల్చర్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం, ట్రివియాల గురించి క్విజ్‌ల రూపంలో  విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. 7.9ఎమ్‌బీ సైజ్‌లో ఉండే ఈ అప్లికేషన్ ఐఓఎస్ వెర్షన్4.3 ఆ తర్వాతి వాటిపై పనిచేస్తుంది.https://itunes.apple.com/ us/app/pixelquiz/ id584793088?ls=1&mt=8 నుంచి ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
మరిన్ని వార్తలు