పవర్ ఆఫ్ యూత్

18 Aug, 2014 02:00 IST|Sakshi
పవర్ ఆఫ్ యూత్

చదువు ఇచ్చిన  మేధస్సు పదిమందికీ పంచితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సాయుపడే గుణం విద్యార్థి దశలోనే మొగ్గ తొడిగితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. జేబీ గ్రూప్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ బీటెక్ సెకండ్ ఇయుర్ విద్యార్థులు ఇదే బాటలో నడుస్తున్నారు. రెండేళ్లుగా ‘మై షెల్టర్ ఫౌండేషన్ ఇండియా’ సంస్థ తరఫున వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. మురికివాడల్లోని జనాలకు వెలుగు ప్రసాదించే కాంతిపుంజాన్ని అందిస్తున్నారు.  కరెంట్ కోతలు.. బిల్లుల వాతలు.. లేకుండా డే లైట్, నైట్ లైట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడితో తమ పనైపోయిందని అనుకోకుండా.. వాటి మెయింటనెన్స్, రిపేర్లపై కూడా పేదలకు అవగాహన కల్పిస్తూ.. యూత్ పవర్ ఏంటో చూపిస్తున్నారు.           - వాంకె శ్రీనివాస్
 
ఇంజనీరింగ్ విద్యార్థులనగానే.. న్యూ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటారంతా. వుంచి ఫ్యూచర్ కోసం వురికొందరు పుస్తకాలతోనే నాలుగేళ్లు గడిపేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విద్యార్థులు వూత్రం వీరికి భిన్నం. కాలేజి ఏజ్‌లో, టీనేజ్ మోజులో పడిపోకుండా కెరీర్‌ను నిర్మించుకుంటూనే సేవా కార్యక్రవూలు నిర్వహిస్తున్నారు. మురికివాడల్లోని పేదల గుడిసెల్లో డే లైట్ అండ్ నైట్ లైట్ తో వెలుగులు నింపుతున్నారు.
 
అలా మొదలు
‘ఇంటర్‌లో ఉండగా డే లైట్, నైట్ లైట్ కాన్సెప్ట్‌పై   ‘మై షెల్టర్ ఫౌండేషన్ ఇండియా’ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్ నన్నెంతో ఇన్‌స్పైర్ చేసింది. ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత.. ఆ ఆలోచనను నా స్నేహితులతో పంచుకున్నాను. వారికీ నచ్చింది. అలా వూ కాలేజీ నుంచి 30 వుందిమి ఒక టీమ్‌గా తయూరయ్యూం. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌లో డే లైట్ వినియోగించుకుంటున్న ప్రాంతాలను చూశాం. తర్వాత మేవుంతా కలసి  ఎస్.ఆర్.నగర్‌లోని ఓ మురికివాడలో ఈ పనికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు సికింద్రాబాద్ సమీపంలోని వుడ్‌ఫోర్డ్ వుురికివాడలో వర్క్ చేస్తున్నాం’ అంటూ వాళ్ల టీం స్పిరిట్ వునవుుందుంచారు టీం మెంబర్స్ ప్రదీప్, ప్రీతమ్.
 
మేడ్ ఎడ్యుకేట్..
తాము చేపట్టిన కార్యాన్ని మెరుగుపరిచే ఆలోచన ఈ మిత్రబృందానికి కలిగింది. లైట్లు బిగించడమే కాదు, వీటిని ఎలా తయూరు చేయూలి.. ఎలా బిగించాలనే దానిపై ప్రజలకు వివరించాలని నిర్ణరుుంచుకున్నారు. డే లైట్, నైట్ లైట్ తయూరీపై ప్రెజెంటేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వుురికి వాడల్లోని ప్రజలకే కాదు.. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఈ డే లైట్ తయూరీపై అవగాహన కల్పిస్తున్నారు. ముంబై ఐఐటీ విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించారు. వారితో కలసి వుుంబైలోని ధారవి మురికివాడలో డే లైట్లను ఏర్పాటు చేశారు.
 
తయూరీ ఇలా..
ప్లెయిన్ వాటర్ బాటిల్. గాల్వానో షీట్, సికాగ్లూ గమ్ అవసరం. మొదట గాల్వానో షీట్ తీసుకొని బాటిల్ చుట్టు కొలతకు సరిపడా కత్తిరించాలి. దానిని బాటిల్  నాలుగో వంతు దగ్గర ఏర్పాటు చేయూలి. సికాగ్లూ గమ్ తీసుకుని బాటిల్‌కు, గాల్వానో షీట్‌కు మధ్య పూయాలి. అప్పుడు అది గట్టిపడుతుంది. ఆ తర్వాత వాటర్ బాటిల్‌లో నీళ్లు పోయాలి. వాటర్‌లో ఫంగస్ రాకుండా అందులో చిటికెడు బ్లీచింగ్ పౌడర్ కలపాలి.

ఇలా గుడిసె పైభాగంలో బాటిల్ సెట్ అయ్యేలా రంధ్రం చేసి.. అందులో బాటిల్ ఉంచి సికాగ్లూ గమ్ పూయూలి. ఇలా అవుర్చిన బాటిల్‌పై సూర్యకిరణాలు పడితే.. బాటిల్ గుండా గుడిసెలోనికి వెలుగు ప్రసరిస్తుంది. సూర్యాస్తవుయుం వరకు వూత్రమే డే లైట్ వెలుతురు ఉంటుంది. ఇక నైట్ లైట్ విషయానికొస్తే డే లైట్ మాదిరిగానే తయారుచేసి వాటర్ బాటిల్ మూత భాగంలో చిన్న బల్బును అమరుస్తారు. దానిపైన సోలార్ సెట్‌ను అమరుస్తారు. సౌరశక్తితో చార్జింగ్ అయిన బ్యాటరీ ద్వారా రాత్రి పూట కూడా వెలుతురు ఉంటుంది.
 
ఖర్చు తక్కువ.. వెలుతురు ఎక్కువ
లైట్ల ఏర్పాటుకు వందల్లోనే ఖర్చవుతుందని చెబుతున్నారు ఆ విద్యార్థులు. అవి కూడా తామే భరిస్తూ మురికివాడల్లో వెలుగులు నింపుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొస్తే.. తవు సేవలు వురిన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తాం అంటున్నారు ఈ యువకులు.
 
మాతో పంచుకోండి
 సావూజిక బాధ్యతను విద్యార్థి దశలోనే స్వాగతించిన వారికిదే వూ ఆహ్వానం. మీ సృజన తోటివారికి సాయుపడితే అది పది వుందికి తెలియూలి.  మీ సేవాభావం వురెందరికో స్ఫూర్తికావాలి. మీ సావూజిక స్పృహ   భావితరాలకు ఆదర్శం అవుతుంది. మీరు చేపట్టిన సావూజిక కార్యక్రవూల వివరాలు వూకు పంపించండి. మెయిల్ టు sakshicityplus@gmail.com
 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేడి వృథా కాకుండా.. కరెంటు..!

రహస్య మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా..

బస్‌లో మహిళ డ్యాన్స్‌ : సిబ్బందిపై వేటు

ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...

తెలివిటీగలు..ప్రైజ్‌ మనీ రూ. 35 లక్షలు..!

లాలిజో.. లాలీజో...

అమ్మకు అర్థం కావట్లేదు

నీటిలోపల రెస్టారెంట్‌..డిన్నర్‌ ఖరీదు ఎంతంటే..

ఎగిరే మోటర్‌బైక్‌..  ద స్పీడర్‌!

కన్యాదానం ఏంటీ?

రౌండప్‌ 2018,2019 

పుడితే కదా బతికేది

మారుతున్న మగతరం

వికసించని బాల్యానికి  విహంగాల నైపుణ్యం!

బ్రెయిన్‌ డైట్‌ 

విషవాయువుకు కొత్త ఉపయోగం

బాల్యం పెరుగుతోంది

క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!

లక్ష కోట్ల మొక్కలతో భూతాపోన్నతికి చెక్‌! 

షీ ఇన్‌స్పెక్టర్‌

అలల ఫ్యాక్టరీతో విద్యుత్‌ ఉత్పత్తి...

మాస్టర్‌ స్విచ్‌ను  కనుక్కున్నారా?

ఆమెకు కులం, మతం లేదు!

ఐరన్‌ లేడీ

భర్త రాసిన ప్రిస్క్రిప్షన్‌

ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టే..

ఆయన గ్యారేజ్‌లో ఆరు రోల్స్‌ రాయిస్‌ కార్లు..

ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!

రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్‌

అయస్కాంతాలతో  కండరాలకు శక్తి...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌