రైట్ రూట్ రాంబాబు

29 Sep, 2014 00:28 IST|Sakshi
రైట్ రూట్ రాంబాబు

పావుగంట సాగే పొట్టి సినిమా.. చిట్టి సందేశం చెబితే చాలనుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా రాంబాబు కాస్త వెరైటీగా ఆలోచించాడు. 15 నిమిషాల్లో ఫీచర్ ఫిలింలో ఉన్న అన్ని ఫ్రేమ్స్ చూపించాలనుకున్నాడు. వెంటనే మంచి కథను ఎంచుకుని.. పెద్ద సినిమా ఎలిమెంట్స్ అన్నింటినీ జొప్పించి షార్ట్ ఫిల్మ్‌గా మలచి అందరినీ మెప్పించాడు.
 
ఒక ప్రేమ కథను సామాజిక కోణంలో చూపిస్తూ రాంబాబు తీసిన చిత్రమే ‘రాంబాబు ఎమ్మెల్యే’. ఇందులో ఎమ్మెల్యే- మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ, మరో ఎమ్మెల్యే- మంచి లక్షణాలున్న అబ్బాయికి మధ్య జరిగే కథ ఈ సినిమా. ఒక జంట ప్రేమ వ్యవహారం నుంచి సమాజంలో నెలకొన్న లంచం, నిరుద్యోగం లాంటి అనేక అంశాలను ఈ సినిమా స్పృశించింది. ఆరు గంటల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది.
 
బెస్ట్ ఆఫ్ ఫస్ట్
‘పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా సినిమా తీయాలనే ఆలోచన రాలేదు. షార్ట్ ఫిలింస్ చూసినపుడు మాత్రం మంచి కాన్సెప్ట్‌తో ఒక్క పొట్టి పిక్చర్ తీయాలనిపించింది. అదే సమయంలో దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా షార్ట్ ఫిలిం కాంపిటీషన్ నిర్వహించారు. అది ఎన్నికల సీజన్ కూడా కావడంతో.. ఎన్నికలకు ముడిపెడుతూ సాగే ఈ కథను ఎంచుకున్నానని, అన్నారు రాంబాబు.
 
గీత మార్చిన రాత
కొన్ని సీరియల్స్‌కు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన రాంబాబు చిన్నప్పటి నుంచి కథలు రాసేవాడు. ‘పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాను. బిర్లా ప్లానిటోరియం దగ్గర ఉద్యోగం చేసుకునేవాడిని. ఓసారి అక్కడ ఓ టెలి యాడ్ షూటింగ్ జరుగుతోంది. అది చూసిన నాకు.. ఆ కాన్సెప్ట్ నచ్చక.. ఇది ఇలా చేస్తే బాగుంటుందని వారికి సూచించాను. వారు పేపర్ మీద రాయమన్నారు. నాకు యాడ్ మేకింగ్, స్క్రీన్‌ప్లే అంటే ఏంటో తెలియదు. నేననుకున్నది పేపర్ మీద రాసిచ్చాను. ఆ షూటింగ్ నిర్వహిస్తున్న చంద్ర మేడం అది చూసి తర్వాత నాకు నాలుగు యాడ్స్‌లో రాసే అవకాశం కల్పించారు. అంతేకాదు ఒక చోట అసిస్టెంట్‌గా కూడా చేర్పించార’ని తన ప్రస్థానాన్ని వివరించారు రాంబాబు.
కళ

>
మరిన్ని వార్తలు