చైనా యాపిల్.. ఈసారి 6వేలే!!

5 Sep, 2014 09:15 IST|Sakshi
చైనా యాపిల్.. ఈసారి 6వేలే!!

ఎంఐ3 ఫోన్తో సంచలనాలు సృష్టించిన చైనా యాపిల్ కంపెనీ జియోమి మరో సంచలనం మొదలుపెట్టేసింది. ఎంఐ3 ధర దాదాపు 14వేలు కాగా, ఇప్పుడు కొత్తగా ఇదే కంపెనీ ప్రవేశపెట్టిన రెడ్ ఎంఐ1ఎస్ ధరను కేవలం 6వేలకే పెట్టింది. 40 వేల ఫోన్లు అమ్మకానికి పెడితే కేవలం 4.2 సెకన్లలోనే మొత్తం అయిపోయాయి. వాస్తవానికి చైనాలో ఈ ఫోన్ అమ్ముతున్న ధరకంటే కూడా భారతదేశంలో కాస్త చవగ్గానే వస్తోంది. ఎప్పటిలాగే ఫ్లిప్కార్ట్ ద్వారానే ఆన్లైన్లో మాత్రమే దీన్ని అమ్ముతున్నారు.

ఎంఐ3లాగే.. ఈ ఫోన్కు కూడా అభిమానులు తక్కువ సమయంలోనే బాగా పెరిగిపోయారు. ఇప్పటికే రెండున్నర లక్షల మంది దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చే బ్యాచ్ మళ్లీ మంగళవారమే అమ్మకాలకు సిద్ధమవుతుంది. దీనికోసం ఫ్లిప్కార్ట్లో రిజిస్ట్రేషన్లు చకచకా సాగిపోతున్నాయి.

ఫీచర్లు
డ్యూయల్ సిమ్ కార్డులను సపోర్ట్ చేసే ఈ ఫోన్ 158 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఎల్సీడీ స్క్రీన్లో 16మిలియన్ల రంగులుంటాయి. లౌడ్స్పీకర్లు, 3.5ఎంఎం జాక్ మామూలుగానే ఉన్నాయి. ఇంటర్నల్ మెమొరీ 8జీబీ, ర్యామ్ 1 జీబీ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని విస్తరించుకోవచ్చు. ఎల్ఈడీ ఫ్లాష్తో కూడిన ఆటోఫోకస్ కెమెరా 8మెగా పిక్సెల్స్ ఉండగా, ఫ్రంట్ కెమెరా 1.6 మెగా పిక్సెల్స్ ఉంది. సెకనుకు 30 ఫ్రేములతో వీడియో తీయగలదు. ఆండ్రాయిడ్ వెర్షన్ 4.3 జెల్లీబీన్తో ఫోన్ పనిచేస్తుంది. దీని సీపీయూ క్వాడ్ కోర్ 1.6 గిగా హెర్ట్జ్ ఉంది. హెచ్టీఎంఎల్5తో బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు