జీన్‌ ఎడిటింగ్‌: తొలి సూపర్‌ హ్యూమన్‌ అతడే..

19 Nov, 2017 19:49 IST|Sakshi

రోగ్‌: సంపూర్ణ శక్తిసామర్ధ్యాలతో సూపర్‌హ్యూమన్‌గా మారే క్రమంలో తన డీఎన్‌ఏను ఎడిట్‌ చేసుకుని ప్రపంచంలోనే తొలి సూపర్‌హ్యూమన్‌గా జోష్‌ జేనర్‌ నిలిచారు. వృత్తిరీత్యా బయోకెమిస్ట్‌, గతంలో నాసాలో పనిచేసిన జేనర్‌ జీన్‌ ఎడిట్‌కు తన శరీరాన్నేప్రయోగశాలగా మార్చుకున్నారు. జీన్‌ కటింగ్‌ టెక్నాలజీతో కండర వృద్ధికి ప్రేరేంపించేలా తన శరీరంలోని మోస్టాటిన్‌ను తొలగించుకున్నారు. జన్యువులకు మనమెంత మాత్రం ఇక బానిసలం కాదని చరిత్రలో తొలిసారిగా చాటిచెప్పామని ఈ సందర్భంగా జేనర్‌ వ్యాఖ్యానించారు.

అమరికా, బ్రిటన్‌లో ఈ తరహా టెక్నాలజీపై పలు నియంత్రణలున్నా తమ సొంత డీఎన్‌ఏ ఎడిటింగ్‌ మాత్రం అక్రమం కాదు. జేనర్‌ తన డీఎన్‌ఏ మార్పు ప్రక్రియను లైవ్‌స్ర్టీమ్‌ చేశారు. డీఎన్‌ఏ ఎడిటింగ్‌ తర్వాత తన శరీరంలో మార్పులు ఖాయమని, అదనపు కండర వృద్ధి చోటుచేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు జీన్‌ ఎడిటింగ్‌ దుష్పరిణామాలపై లండన్‌కు చెందిన క్రిస్పర్‌ పరిశోధకులు రాబిన్‌ బాడ్గె హెచ్చరించారు.

అయితే శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో తమపై తాము ప్రయోగాలు చేసుకోవడం సహజంగా ఎప్పటినుంచో జరుగుతున్నదేనని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ బయో కెమిస్ట్‌ జాన్‌ హారిస్‌ జేనర్‌ చర్యను సమర్ధించారు.
 

మరిన్ని వార్తలు