సెల్ఫీలతో బుక్కవుతున్నారు..

2 Mar, 2018 17:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : సెల్ఫీలతో ప్రాణాలను పణంగా పెడుతున్న ఉదంతాలు కోకొల్లలుగా వెల్లడవుతుంటే తాజాగా సెల్ఫీలతో కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకుంటూ ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తుండటంతో పెద్దసంఖ్యలో యువత కాస్మెటిక్‌ సర్జరీతో ముక్కు తీరును మార్చుకుంటోందని ఓ అథ్యయనం వెల్లడించింది.  ముఖానికి 12 ఇంచ్‌ల దూరం నుంచి తీసుకున్న ఫోటోల్లో ముక్కు పరిమాణం 30 శాతం పెరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో కాస్మెటిక్‌ సర్జన్లను ఆశ్రయిస్తున్న యువత తమ ఆరోగ్యాలను పణంగా పెడుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరికొంతమంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో తాము బాగా కనిపించాలనే తపనతో ముక్కు సర్జరీలకు ముందుకొస్తున్నారని అథ్యయనంలో పాల్గొన్న 42 శాతం మంది ప్లాస్టిక్‌ సర్జన్లు చెప్పారు. మీ ముఖ ఆకృతిలో సెల్ఫీ ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఫేషియల్‌ ప్లాస్టిక్స్‌, రీకన్‌స్ర్టక్టివ్‌ సర్జన్‌ డాక్టర్‌ బొరిస్‌ పషోవర్‌ చెప్పారు. తమ ముక్కు ఆకృతి సరిగా లేదని సెల్ఫీలను తీసుకొస్తున్న పేషెంట్లకు తాను వారి ముక్కు వాస్తవంగా అలా లేదన్న విషయం విడమరచి చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు