వివక్షను నిలదీయండి

24 Feb, 2015 01:42 IST|Sakshi
వివక్షను నిలదీయండి

స్టార్ హిమక్రీమ్: రకరకాల హిమక్రీమ్స్‌తో సిటీవాసుల మనసుదోచుకున్న మాగ్నమ్ కంపెనీ  మాస్టర్ క్లాస్ 2.0 పేరుతో మరోఫ్లేవర్‌ను తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ హిమక్రీమ్‌ను జూబ్లీహిల్స్‌లోని ఎన్-డిస్ట్రిక్ట్‌లో సోమవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మోడల్ శిల్పారెడ్డి, ఆమె సోదరుడు సామ్రాట్‌రెడ్డి, విదేశీ చెఫ్‌లు జేనీస్ వాంగ్, ఫ్రిట్జ్ స్టార్మ్ పాల్గొన్నారు.  
 
 పురాణాల కాలం నుంచి నవీన యుగం వరకూ ఆడవాళ్లు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి ఆడపిల్లకు దినదిన గండంగానే గడుస్తోంది. ఆడపిల్లగా పుట్టినందుకు కన్నవారి చిన్నచూపును భరిస్తున్నారు. చదువుకునే రోజుల్లో.. ఉద్యోగపర్వంలో.. ఎందరో మహిళలు కీచకపర్వాలు చూస్తూనే ఉన్నారు. మన దేశంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హబ్సిగూడలోని ఐఐసీటీ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, నటి, నర్తకి మల్లికా సారాభాయ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాట ల్లోనే..
 
 ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి ఎవరో ఒకరి అదుపాజ్ఞల్లో బతకాల్సి వస్తోంది. చరిత్ర పుటలు తిరగేస్తే.. ఆడపిల్లకు పుట్టిన నాటి నుంచి ఆంక్షలే. ఉన్నన్ని రోజులు పుట్టింట్లో కుక్కిన పేనులా పడుండాలి. పెద్దయ్యాక పెళ్లి అని ఒక్క రోజులో ఆమె జీవితాన్ని మార్చేసేవారు. కాలం మారినా.. పరిస్థితులు మాత్రం ఇంకా అలాగే ఉంటున్నాయి. కూతురును పెంచే తల్లిదండ్రులు.. ఎప్పటికైనా ఆడపిల్ల.. ‘ఆడ’పిల్లే అంటూ పరాయి చేస్తున్నారు. తీరా పెళ్లయ్యాక అత్తారింట్లో పరాయి ఇంటి నుంచి వచ్చిన మనిషిలాగే చూస్తున్నారు తప్ప.. సొంత మనిషన్న గుర్తింపు ఇవ్వడం లేదు. మరి ‘ఆమె’కు సొంత ఇళ్లంటూ లేనట్టేనా?
 
 తక్షణ మార్పు అవసరం
 పేరుకే కర్మభూమి.. ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు వింటుంటే వనితాలోకం ఇదేం ఖర్మ అని రోదిస్తోంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న వారిని సమాజం ఏం చేయగలుగుతోంది..? 20 ఏళ్ల కిందట రాజస్థాన్‌లో ఓ సంఘటన.. ఓ ఏడేళ్ల బాలికపై ఆమె తాతయ్యే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం బయటపడ్డాక.. చీము నెత్తురు లేని ఆ మనిషి ‘మా  ఇంట్లో పండును మేం తినకుండా వేరేవారికి ఇవ్వాలా’ అని అన్నాడు. ఇలాంటి దారుణాలు ఎన్నో మన దేశంలో ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. కఠినమైన చట్టాలు రూపొందించడం కాదు.. వాటిని పక్కాగా అమలు చేసినపుడే ఇలాంటి అకృత్యాలు తగ్గుతాయి. ఆడపిల్లల విషయంలో సామాజిక దృక్పథం తక్షణం మారాల్సిన పరిస్థితులున్నాయి. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా పెంచండి. ఎవరైనా అలా వివక్ష చూపిస్తే పిల్లలూ! మీరు తప్పక  నిలదీయండి. ఈ తరం తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారు. చాలా మంచి విషయం. అయితే మీ పిల్లలను స్కూల్, ట్యూషన్, ర్యాంకులకు మాత్రమే పరిమితం చేయకుండా వారికి ఇతిహాసాలు, తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి. అవి వారిలో మానసిక బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
 -  నిఖితా నెల్లుట్ల
 

మరిన్ని వార్తలు