డ్రంకన్ డ్రైవ్!

3 Jan, 2015 00:56 IST|Sakshi
డ్రంకన్ డ్రైవ్!

మద్యం సేవించి కారు నడుపుతూ బుక్కైపోయాడు ‘బాలికా వధు’ నటుడు సిద్ధార్థ్ శుక్లా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో  ‘ఊగుతూ’ తెగ ఎంజాయ్ చేసిన ఇతగాడు... ఇంటికి తిరిగి వెళుతుండగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. పరిమితికి మించి మద్యం తీసుకున్నందుకు రెండు వేల రూపాయలు ఫైన్ కూడా వేశారు. లెసైన్‌‌స లాక్కున్నారు.

దెబ్బకు మత్తు దిగే లోపే... మరో షాకిచ్చారు. రాత్రంతా స్టేషన్‌లో ఉంచి... తెల్లారి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మొత్తానికి... కొత్త సంవత్సరం సందర్భంగా జుహూలో తన మిత్రులతో కలసి పార్టీ చేసుకున్న సిద్ధార్థ్ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఓ ‘కొత్త’ అనుభూతినీ మిగిల్చింది!

మరిన్ని వార్తలు