‘సిల్క్’ షోయగం

3 Jul, 2015 00:08 IST|Sakshi
‘సిల్క్’ షోయగం

నగర ఫ్యాషన్ ప్రియుల కోసం విభిన్న వస్త్రాలతో ‘సిల్క్ ఆఫ్ ఇండియా’ వస్త్ర ప్రదర్శన  గురువారం ప్రారంభమైంది. పట్టు, డిజైనరీ చీరలు, ఒక్క గ్రాము బంగారు ఆభరణాలతో శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వర్ధమాన నటి శ్వేత జాదవ్ ప్రారంభించారు. ఇక్కడి డిజైనరీ చీరలు ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు.

హస్త, చేనేత కళాకారుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఆశిష్ గుప్తా తెలిపారు. ప్రదర్శన ఈనెల 6 వరకు కొనసాగుతుందన్నారు.    - శ్రీనగర్‌కాలనీ
 

మరిన్ని వార్తలు