ఒత్తిడితో చిత్తవుతున్న యువత 

13 Mar, 2018 15:01 IST|Sakshi

లండన్‌ : జీవితమంతా బతుకు పోరాటంతో సతమతమయ్యే సామాన్యులు ఎంతటి ఒత్తిడితో చిత్తవుతారో ఓ అథ్యయనం వెల్లడించింది. 25 - 35 ఏళ్ల యువత ప్రతి పది మందిలో ఆరుగురు డబ్బు, జీతం, జీవితాన్ని ఈదడం ఎలా అనే ఆలోచనలతో కుంగిపోతున్నారని పరిశోధనలో తేలింది. సగం మందికి పైగా యువత రోజువారీ ఖర్చులను అధిగమించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక ప్రేమలో విజయం సాధించేందుకు, సవాల్‌తో కూడిన ఉద్యోగాన్ని నిలబెట్టుకునేందుకు ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడైంది.

గత ఆరు నెలలుగా మీరు ఎలా ఉంటున్నారన్న ప్రశ్నకు తాము తీవ్ర ఆందోళన, గాబరా, గందరగోళం, తీవ్ర విచారంగా ఉంటున్నామనే సమాధానం అతిసాధారణంగా వారి నుంచి వ్యక్తమైందని ఫస్ట్‌ డైరెక్ట్‌ బ్యాంక్‌ కోసం నిర్వహించిన అథ్యయనం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు, జీవనశైలి, సవాల్‌తో కూడిన ఉద్యోగాలు, శృంగారం కొరవడటం, తల్లితండ్రులతో సంబంధాలు, సోషల్‌ మీడియా, స్థిరాస్తిని సమీకరించుకోవడం వంటి అంశాల్లో తీవ్ర ఒత్తిడి ఎదురవుతోందని అథ్యయనం తేల్చిచెప్పింది. కాగా యువత ఒత్తిడి, భవిష్యత్‌పై భయంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని సైకాలజిస్ట్‌ డాక్టర్‌ ఒలివర్‌ రాబిన్సన్‌ అథ్యయన వివరాలను విశ్లేషించారు.

మరిన్ని వార్తలు