సాంగు భళా

10 Nov, 2014 00:14 IST|Sakshi
సాంగు భళా

‘చిన్న చిత్రం’ జేబీ లక్ష్మణ్ జీవితాన్ని పెద్ద వులుపే తిప్పింది. అనూహ్యంగా సినీ పరిశ్రలో స్థిరపడేలా చేసింది. ‘కృతజ్ఞత’ అనే లఘు చిత్రానికి రాసిన పాట యుూట్యూబ్‌లో వేలల్లో హిట్స్ సంపాదించింది. దెబ్బకు నోడి కెరీర్‌కు సిల్వర్ స్క్రీన్ ‘టచ్’ వచ్చేసింది. కట్ చేస్తే... ప్రస్తుతం ప్రవుుఖ చిత్రాలకు లిరిక్స్ రైటర్‌గా మంచి జోష్ మీదున్నాడీ కుర్రాడు. సినీ రంగంలో లక్ష్మణ్ ‘షార్ట్’ జర్నీ ఇదీ...
 సొంతూరు కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని కల్వాయి.

హైదరాబాద్‌లో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశా. ఎనిమిదో తరగతి నుంచే పాటలు రాయడమంటే ఆసక్తి. కాలేజీ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే మనముండాల్సిందే. చిన్న చిన్న కవితలు, పాటలు రాసి ఫ్రెండ్స్‌కు వినిపించేవాడిని. కాలేజీ ఫంక్షన్లలో పాడేవాడిని. పాటలు, సాహిత్యంపై పట్టు సాధించేందుకు సామాజిక తత్వవేత్త బీఎస్ రాములు ఇచ్చిన పుస్తకాలు బాగా ఉపయోగపడ్డాయి. 2009లో హైదరాబాద్‌లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నేను రాసి పాడిన ప్రకృతి పాటకు నంది అవార్డుతో పాటు రూ.పదివేల నగదు లభించింది. అప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.

సినీ ప్రముఖులు చంద్రబోస్, కాశీ విశ్వనాథ, అనంత్ శ్రీరామ్ వద్ద పాటలు రాయడంలో మెలకువలు నేర్చుకున్నా. అప్పుడే లఘు చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. అదే సవుయుంలో సన్నిహితులు నిర్మిస్తున్న ‘కృతజ్ఞత’, ‘కక్ష’ షార్ట్ ఫిల్మ్స్‌కి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ పాటలు సూపర్ హిట్. కెరీర్ కొత్త మలుపు తిరిగింది.

దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమయ్యే కాంతిరేఖ టైటిల్ సాంగ్ రాసే అవకాశం వచ్చింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మన ఊరి సాక్షిగా’, ‘ఈజీ మనీ’, ‘ప్రేమించు’ సినిమాలకు పాటలు రాశా. అల్తాఫ్ హుస్సేన్, కృష్ణవేణి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మళ్లీ రాదోయ్.. లైఫ్’ సినిమాకు లిరిక్స్ అందించా. ఈ నెల ఏడున విడుదలైన ఈ సినిమా పాటలకు మార్కెట్లో మంచి ఆదరణ కనబడుతోంది.

వాంకె శ్రీనివాస్

మరిన్ని వార్తలు