సంఘ సంస్కర్త, జాతి నిర్మాత

5 Dec, 2014 01:27 IST|Sakshi
కె. రాజు

 విశ్లేషణ
 రేపు అంబేద్కర్ వర్ధంతి
 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబేద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్లమెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘటనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే  అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు.
 
 డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) సంస్కర్త, ఉదార ప్రజాతంత్ర వాది. అణగారిన వర్గా లు, ప్రత్యేకించి ఎస్సీ/ ఎస్టీల ప్రయోజనాల కోసం పాటుపడ్డ వ్యక్తిగా ప్రధానంగా చెప్పుకోవడం పరిపాటి. దీనితో మొత్తం జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు మరుగున పడ్డాయి. భారత రా జ్యాంగ నిర్మాతగా ఆయన చరిత్రలో స్థిరపడిపోయినా ఈ బహుముఖ ప్రజ్ఞాపా టవాల గురించి చర్చ నడవలేదు. 1927లో హిల్టన్ యంగ్ కమిషన్‌కు అంబేద్కర్ ఇచ్చిన మహాజరు ఆధారంగానే రిజర్వు బ్యాంకు విధి విధానాలు రూపుదిద్దుకున్నా యి. భారతీయ ద్రవ్యం, ఆర్థిక సమస్య లపై ఏర్పడ్డ రాయల్ కమిషన్ అంబేద్కర్ రాసిన ‘రూపాయి సమస్యలు, పుట్టుక, పరిష్కారం’ అన్న గ్రంథంతో తీవ్రంగా ప్రభావితమైంది. 1934లో భారత రిజర్వు బ్యాంకు చట్టంవచ్చింది. 1942-46 మధ్య కాలంలో వైశ్రాయ్ మంత్రిమండలిలో ఆయన కార్మిక, నీటిపారుదల, విద్యుత్ శాఖమంత్రిగా పనిచేశారు. కేంద్ర జలవన రుల సంఘం, దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక వనరులు సమకూర్చ టానికి ఉద్దేశించిన కేంద్ర సాంకేతిక విద్యు త్ బోర్డుకు కూడా ఆయనే ఆద్యుడు.

 అంబేద్కర్  జీవితాన్ని, కృషిని అధ్య యనం చేసిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఆయన దృక్ప థం అందరికీ సమాన హక్కులు కోరు తోంది. రాజ్యాంగ పరిషత్ లో తన చివరి ప్రసంగంలో తన ఆలోచనను మరింత విఫులీకరించారు. ‘‘మనం సాధించిన రాజకీయ ప్రజా స్వామ్యాన్ని, సామాజిక ప్ర జాస్వామ్యంగా మార్చాల్సి న అవసరం ఉంది. పునాది లో సామాజిక ప్రజాస్వా మ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్య మనుగడ సాగించజా లదు’’ అన్నారు.  ప్రథమ న్యాయశాఖ మంత్రిగా మహిళా హక్కులను చట్టబద్ధం చేయటానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందే మహిళా ఉద్ధరణ కోసం పని ప్రారంభించారు. లోథియన్ కమిషన్ (1932) విచారణలోనూ 1933-34లో ఏ ర్పాటైన జాయింట్ సెలెక్ట్ కమిటీ ముం దూ మహిళల హక్కుల కోసం వాదించా రు. దాని ఫలితంగానే 1935 భారత ప్రభుత్వ చట్టంలో తొలిసారి మహిళలకు ఓట హక్కు దక్కింది. రాజ్యాంగ ముసా యిదాలో కూడా 14-16 అధికరణాల ద్వారా మహిళలకు పౌర హక్కులు దఖలు పర్చటంతో పాటు, కన్యాశుల్కా నికి స్వస్తి చెప్పటంలో ఆయనదే ప్రధాన పాత్ర.

 స్వాతంత్య్రానికి ముందే మంత్రివర్గం లో చేరమని డాక్టర్ అంబేద్కర్‌ను  నెహ్రూ ఆహ్వానించారు. ఆ నాటికి హిందూ చట్టం గురించి ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాలను క్రోడీకరించి ఒకే చట్టాన్ని దేశం ముందుం చే క్రమంలో డాక్టర్ అంబేద్కర్ హిందూ స్మృతిని ప్రతిపాదించారు. విప్లవాత్మకమైన ఈ చట్టం మహిళలకు సమాన హక్కులు కల్పించటంతో పాటు కుల పరమైన వ్యత్యాసాలకు తా వు లేకుండా చేసింది. బీఎన్ రావు కమిటీ ప్రతిపాదిం చిన ముసాయిదాను కూ లంకషంగా పరిశీలించిన ఆయన అనేక ముఖ్యమైన సవరణలతో హిందూ స్మృ తి బిల్లు ప్రతిపాదించారు. దీనితో మొదటిసారిగా వితంతువులు, కూతుళ్లు, కొడుకులతో పాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కుదారు లయ్యారు. గృహహింస లేదా భర్తలు నిర్ల క్ష్యం చేయటం కారణంగా భార్యలకు విడా కులు తీసుకునే హక్కు దక్కింది. భర్త రెం డో భార్యను పెళ్లాడటాన్ని నిషేధించింది. వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ పురుషులు హిందూ చట్టం కింద వివాహమాడే అవకా శం వచ్చింది.

 1949లో అప్పటికే అఖిల భారత హిందూ స్మృతి వ్యతిరేక కమిటీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పని ప్రారంభించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబే ద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్ల మెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘ టనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే  అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. బహుశా భారతదేశ చరిత్రలోనే మహిళలకు హక్కు లు కల్పించాలన్న డిమాండ్‌తో  కేంద్రమం త్రి రాజీనామా చేయటం ఇదే తొలి సంఘటన.

 తొలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజ యం సాధించిన నెహ్రూ హిందూ స్మృతి ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే ఒకే చట్టంగా కాక హిం దూ వివాహ చట్టం, విడాకుల చట్టం, వార సత్వ చట్టం, దత్తత చట్టం పేర్లతో వివిధ భాగాలుగా ప్రవేశపెట్టారు. వీటిని  మహి ళా సభ్యులతో పాటు విఎన్ గాడ్గిల్, పం డిట్ ఖుజ్రు వంటి సభ్యులు సమర్థించారు. తరువాత సంస్కరణవాదులు, మితవా దులు అనివార్యంగా బలపర్చాల్సిన పరి స్థితి వచ్చింది.

 ఈ బిల్లులు 1955-56లో చట్టాల రూ పం దాల్చాయి. అనంతరం కొంత కాలా నికి డాక్టర్ అంబేద్కర్ స్వర్గస్థులయ్యారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ నెహ్రూ, ‘‘హిందూ సమాజంలోనే అన్ని రకాల అణ చివేతతో కూడిన లక్షణాలపై తిరుగుబాటు ప్రకటించిన వ్యక్తిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారు. అంతేకాదు. హిందూ స్మృ తికి సంబంధించి ఆయన ప్రదర్శించిన ఆసక్తి, ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన జీవించి ఉండగానే ఆయన ప్రతి పాదించిన సంస్కరణల్లో అనేకం ఆయన ప్రతిపాదించిన రూపంలో కాకపోయినా వివిధ భాగాలుగా చట్ట రూపం తీసుకో వటం సంతోషకరం’’ అని ప్రకటించారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా భారతీయ సమాజ నిర్మాణంలో నెహ్రూ, బాబా సాహెబ్ అంబేద్కర్‌ల సంయుక్త కృషిని స్మరించుకోవటం ఇరువురికీ సమ ర్పించగలిగిన నివాళి.
 (వ్యాసకర్త ఏఐసీసీ ఎస్.సి.విభాగం అధ్యక్షులు)
 

మరిన్ని వార్తలు