సోనమ్.. ద హంగ్రీ యంగ్ ఉమన్

30 Nov, 2014 22:54 IST|Sakshi
సోనమ్.. ద హంగ్రీ యంగ్ ఉమన్

బాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మెన్ గురించి జనాలకు తెలుసు. అయితే, సోనమ్ కపూర్ తనకు తానే ‘హంగ్రీ యంగ్ ఉమన్’గా చెప్పుకుంటోంది. ఆకలి వేయనంత వరకే తాను స్థిమితంగా ఉంటానని, ‘ఆకలేస్తే నేను నాలా ఉండను’ అంటోంది. ‘స్నికర్స్’ చాక్లెట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్న సోనమ్, అపరిమితంగా చాక్లెట్లు సరఫరా చేస్తామని చెప్పడంతోనే ఈ కంపెనీ చాక్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పుకున్నానని మీడియాకు అసలు సంగతి చెప్పేసింది.

రంగస్థలంపై మోనా చూపు
బాలీవుడ్ భామలంతా సినీ అవకాశాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుంటే, మోనా సింగ్ మాత్రం తన రూటే సెపరేటు అంటోంది. బుల్లితెరతో ప్రారంభించి, ఇప్పుడిప్పుడే సినిమాల్లో కనిపిస్తున్న మోనా, తాజాగా ‘జెడ్ ప్లస్’లో నటిస్తోంది. ఇక రంగస్థలంపై తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నానని ఆమె చెబుతోంది. ‘జెడ్ ప్లస్’లో నటిస్తున్న ముకేశ్ తివారీ, అదిల్ హుస్సేన్, కుల్‌భూషణ్ ఖర్బందా వంటి వారంతా రంగస్థలం నుంచే వచ్చారని, వారి స్ఫూర్తితోనే ఒక నాటకంలో నటించాలనుకుంటున్నానంది.

‘విరాసత్’ నటి అమెరికాలో డీజే
విరాసత్, హసీనా మాన్ జాయేగీ వంటి సినిమాల్లో నటించిన పూజా బత్రా ఇప్పుడు అమెరికాలో స్థిరపడి, అక్కడ డీజే అవతారమెత్తింది. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజెల్స్‌లో ఉంటోంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల కోసం సొంతంగా బాలీవుడ్ మ్యూజిక్ రేడియో స్టేషన్ ప్రారంభించి, దాని ద్వారా శ్రోతలను డీజేగా అలరిస్తోంది. ఇక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లే బాలీవుడ్ నటీనటులను ఆహ్వానిస్తూ, వారిని డీజేలుగా పెట్టి కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది.
 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా