భువిలో వైకుంఠం.. ఆంగ్‌కోర్‌వాట్ దేవాలయం

14 Sep, 2014 01:51 IST|Sakshi
భువిలో వైకుంఠం.. ఆంగ్‌కోర్‌వాట్ దేవాలయం

విదేశీ పుణ్యక్షేత్ర సందర్శనం అత్యంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. అక్కడి భాష, సాంఘిక అలవాట్లు, కట్టుబాట్లు తెలియక చాలామంది వెళ్లాలని బలమైన కోరిక ఉన్నా వెనుకంజ వేస్తుంటారు. సామాన్యుడికి సైతం ఈ ఆలయ సందర్శనం సులభం కావాలనే లక్ష్యంతో ట్రావెల్ ఛాయిస్ ఇంటర్నేషనల్ ఎం.డి. శ్రీ సంకురాత్రి బాల వెంకటేశ్వరరావుగారు, విదేశీ హిందూ దేవాలయాల సందర్శనకు ‘వరల్డ్ వైడ్ హిందూ’ అనే పేరిట ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసి ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
 
 భువిలో వైకుంఠాన్ని తలపించే ఆలయాన్ని మీరెప్పుడైనా చూశారా? ఆ ఆలయం కంబోడియాలో ఉంది. కంబోడియాలో తొమ్మిదో శతాబ్దిలో కేవలం 35 ఏళ్ల వ్యవధిలో నిర్మించిన వైకుంఠవాసుని దివ్యధామమైన ‘ఆంగ్‌కోర్ వాట్’ దేవాలయం విశేషాలను తెలుసుకుందాం. ఒకప్పుడు కాంబోడియాను కాంభోజ దేశంగా పిలిచేవారు. యూరోపియన్ల ప్రభావంతో దీని పేరు కంపూచియాగా, కంబోడియాగా మారింది.  కంబోడియాలోని ‘ఆంగ్‌కోర్ వాట్’ మహావిష్ణు ఆలయం ఒక మహాద్భుతం. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణాన్ని తలపెట్టిన రాజు రెండవ సూర్యవర్మ. అతని మరణంలోగా ఆలయ నిర్మిస్తే  మోక్షం లభిస్తుందని పండితులు చెప్పారు. వెంటనే ఆయన ఆలయ నిర్మాణం చేపట్టాడు.
 
  ముందుగా ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు. ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్’ రాళ్లను ఎంపిక చేశారు. వాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు. పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు.
 
 ఈ ఆలయంలో 1,352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్’ పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. పశ్చిమ ముఖద్వారం గల ఈ ఆలయం ముఖద్వారం నుంచే మూడు పెద్దపెద్ద గోపురాలు కనిపిస్తాయి. టోనెల్‌సాన్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని పలు దేవాలయాల సముదాయం ఆహ్లాదభరితంగా ఉంటుంది. తర్వాతి కాలంలో ఈ ఆలయం తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఇది తిరిగి వెలుగు చూసింది. కంబోడియా జాతీయ పతాకంపై ‘ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయ చిత్రం ఉంటుందంటే, ఆ దేశం ఈ ఆలయానికి ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించిన సూర్యవర్మ మరణానంతరం తన అస్థికలను ఒక పేటికలో ఉంచాలని ఆదేశించాడట. తన మరణానంతరం అలా చేయగానే ఆయన మోక్షం పొందాడనేందుకు సూచనగా విష్ణుమూర్తి విగ్రహం కళ్లు తెరిచిందట. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన దివ్యధామం ‘ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయం.
ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయం
 Ph:    8143000999,     040 67461999
 SMS: HOLIDAY WWH to 56677

మరిన్ని వార్తలు