ఫ్యాషనబుల్ సిటీ

1 Dec, 2014 22:51 IST|Sakshi
ఫ్యాషనబుల్ సిటీ

హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటున్న శ్రీదేవి.. నయా ఫ్యాషన్స్‌ను ఓన్ చేసుకోవడంలో భాగ్యనగరం ఈజ్ ద బెస్ట్ సిటీ అంటున్నారు. సినిమా ప్రపంచంలో పెరిగిన ఈ అతిలోకసుందరి.. కొత్తగా ఫ్యాషన్ సూత్రాలు చెబుతుందేంటని అనుకుంటున్నారా..? శ్రీదేవి సోదరి, నటి మహేశ్వరి డిజైన్ చేసిన కలెక్షన్లు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ‘అంగసూత్ర’లో కొలువుదీరాయి. ‘మహి అయ్యప్పన్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ డిజైనర్ లైన్‌ను లాంచ్ చేయడానికి ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవితో ‘సిటీప్లస్’ మాటామంతి..
 
నా సినిమాలెన్నో హైదరాబాద్‌లో షూటింగ్ చేసుకున్నాయి. అందుకేనేమో ఈ సిటీ అంటే నాకు స్పెషల్. నేను ఎక్కడున్నా.. తెలుగువారంతా నా మనసుకు ఎంతో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తారు. అందుకే నా చెల్లెలు మహి డిజైనర్ లైన్‌ను హైదరాబాద్‌లోనే లాంచ్ చేయమని సజెస్ట్ చేశాను.
 
ఈ రోజు కోసమే..
హైదరాబాదీ యువతులు ట్రెడిషన్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. కొత్త ఫ్యాషన్స్‌ను అంతే ఆదరిస్తారు. నయా ట్రెండ్స్‌ను అనుసరించడంలో ఇతర దేశాల ఫ్యాషన్ ప్రియులతో మన సిటీ యువతులు ఏమాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే వారికి దీటుగా నిలబడతారు. ఒక్క ఫ్యాషన్ రంగమనే కాదు.. అన్నిట్లోనూ వారు ముందుంటున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఫ్యాషన్ ప్రేమికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే మహి తన డిజైనింగ్స్ ఇక్కడ లాంచ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు కోసం నేను రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను.

మహి సూపర్
నటిగా అందరికీ తెలిసిన మహిలో గొప్ప డిజైనర్ దాగుంది. నేను వేసుకున్న ఈ అందమైన గౌన్ డిజైన్ చేసింది కూడా తనే. మహీ ఏ డిజైనింగ్ కోర్స్ చేయలేదు. కేవలం అబ్జర్వేషన్‌తో, స్పెషల్ ఇంట్రెస్ట్‌తో ఈ రంగంలోకి వచ్చింది. తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే తన డిజై న్ చేసిన కలెక్షన్ జనం మధ్యలోకి రావాలనుకున్నాను. హైదరాబాద్‌లో నైట్ గౌన్స్, కాక్‌టెయిల్ గౌన్స్‌కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ కలెక్షన్‌కు సంబంధించిన డిజైనర్లు సిటీలో రేర్‌గా ఉన్నారు. ‘మహి అయ్యప్పన్’ వీటికి స్పెషల్‌గా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు