కల్యాణం.. కమనీయం

28 Mar, 2015 23:31 IST|Sakshi
కల్యాణం.. కమనీయం

జానకిరాముల విశేషాలు, పెళ్లి మంత్రాలకు అర్థాలు పిల్లలకు వివరించారు ఉమ. శ్రీరామ నవమి ప్రత్యేకతను చిన్నారులు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈతరం పిల్లలకు రాముడు, ఆయన గాథ తెలియదని, అవన్నీ ఇలా వారి చేతే చేయించి చూపడం వల్ల ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారని అన్నారు పేరెంట్ కె.రాంబాబు. ‘రాముడికి బట్టలు పెట్టాం. బాసికం కట్టాం. తెర పట్టుకుని మంత్రాలు చదివాం. తలంబ్రాలు పోశాం. పూల బంతులు ఆడాం. దేవుడి పెళ్లి మేమే చేశాం. పెళ్లయ్యాక ఉంగరాల ఆట కూడా ఆడాం. ఈ కల్యాణం మాకెంతో నచ్చింది’ అంటూ మురిసిపోతూ చెప్పారు చిన్నారులు ఆశ్రీత మణికంఠ, వంశిక, అంశృత. అలాగే... బుడతలు అయోధ్యాధిపతికి కట్నకానుకలు చెల్లించే ఘట్టాన్నీ... తమ ముద్దు ముద్దు మాటలతో మహా రక్తి కట్టించారు.

‘విగ్రహాల ఆవాహన నుంచి వివాహ మహోత్సవంలోని ప్రతి ఘట్టాన్నీ సంప్రదాయబద్దంగా పిల్లలతో చేయించాం. కంకణ ధారణ, రాముడికి స్నాతకోత్సవం, యజ్ఞోపవీత ధారణం... ఇలా ప్రతి ఘట్టాన్నీ నిర్వహిస్తూ, వాటి కారణాలను వివరించాం. పిల్లలే పేరంటాళ్లను పిలిచి ఈ తంతు చేశారు. రామాయణ శ్లోకాలు వినిపించి, వారి చేత ఉచ్ఛరిస్తూ, వాటి అర్థాలను చెప్పడం వల్ల చిన్నారులు ఇంత పెద్ద కార్యాన్ని ఎంతో ఆసక్తిగా, ఓపిగ్గా పూర్తిచేశారు’ అన్నారు ఉమా చల్లా.     ఓ మధు
 

మరిన్ని వార్తలు