స్టిక్ ఫ్రేమ్స్

31 Jul, 2014 00:19 IST|Sakshi
స్టిక్ ఫ్రేమ్స్

ఎవరి ఇంటికి వెళ్లినా.. ఎదురుగా కనిపించేది ఫొటో ఫ్రేమే. దేవుడిదో..  తాతయ్యదో.. బామ్మదో.. ఎవరెవరి ఫొటోలో గోడకు వేలాడుతూ పలకరిస్తాయి.  ఓసారి ఇల్లంతా కలయ తిరిగితే లామినేటెడ్ ఫ్రేమ్ రూపంలో చిలిపి చిన్నారుల చిత్రాలు హాయ్ అంటాయి. జమానా బదల్ గయా.. అన్నింటా కొత్తందాలకు చోటిస్తున్న ఈ తరం.. ఫొటోలను కూడా వెరైటీగా పదిలపరుచుకోవాలని ఫిక్సవుతోంది. ఇలాంటి వారిని స్టిక్ ఫ్రేమ్స్ కట్టిపడేస్తున్నాయి.
 
జ్ఞాపకాలను పది కాలాలు ఉంచేది ఫొటో. అందుకే తీపి గుర్తుల ప్రతిబింబాన్ని ఆల్బమ్‌లో దాచుకుంటాం. వుది దోచిన వుధుర క్షణాలను ఫ్రేమ్‌లలో బంధించి గోడలపై అలంకరించుకుంటాం. ఒక్కసారి ఫ్రేమ్ ఫిక్సరుుతే.. ఏళ్లకేళ్లు అలాగే ఉంటారుు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. పాత ఫ్రేమ్‌ను అలాగే గోడకు వేలాడుతూనే ఉంటుంది. ఇప్పుడా చింత లేదు. మీ అందమైన ఫొటోలకు పొందికైన రూపాన్నిస్తుంది ఫ్రేమ్ స్టిక్కర్స్. డిఫరెంట్ స్టిక్కర్స్‌లో ఫొటోలను నగరవాసులు సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. చెట్టు కొమ్మలకు రెమ్మలుగా ఫ్రేమ్స్ స్టిక్ చేసి ఫ్యామిలీ మెమరీస్‌ను ఇంపుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉడెన్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్ ఫొటో ఫ్రేమ్‌లతో పోల్చుకుంటే వీటి ఖరీదు తక్కువే.
 
 అతికిస్తే సరి :
 వేరు వేరు సైజుల్లో ఉండే ఈ స్టిక్కర్ ఫ్రేమ్‌ల మధ్యలో ఖాళీ ఉండి, వెనుక భాగమంతా జిగురు ఉంటుంది. కావాల్సిన ఫొటోను ఈ స్టిక్కర్ల వెనుక వైపు మధ్యలో పెట్టి నొక్కితేఅది స్టిక్కర్‌కి అతుక్కుపోతుంది. ఆ తరువాత ఈ ఫ్రేమ్‌ని నచ్చిన చోట గోడకు అతికిస్తే సరి. డిఫరెంట్ కలర్స్, థీమ్స్‌తో అందుబాటులో ఉన్న స్టిక్కర్ ఫ్రేమ్స్ సిటీ వాసులకు బాగా కనెక్ట్ అవుతున్నారుు. పైగా, ఈ ఫ్రేమ్‌లను ఎన్ని సార్లరుునా  తీసి కావల్సిన చోట మళ్లీ అతికించుకోవచ్చు. మేకులతో గోడలు పాడవుతాయునే దిగులూ ఉండదు. ఈ ఫొటో ఫ్రేమ్స్ ఫర్నిషింగ్, వాల్ డెకార్ స్టోర్స్‌లో, ఫ్యాబ్ ఫర్నిష్ ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నారుు.
  - విజయారెడ్డి

మరిన్ని వార్తలు