ఆ..బాలగోపాలం!

17 Aug, 2014 01:06 IST|Sakshi
ఆ.. బాలగోపాలం!

బృందావనమాలి.. ఈ బృందానికి నిత్య అతిథి. వేణుగానలోలుడు వీరి తెర వేలుపు. పౌరాణిక నాటకాలకు పుట్టినిల్లుగా శోభిల్లుతున్న సురభి కళా వేదికకు నల్లనయ్యు సుపరిచితుడు. ఆ ఉవ్ముడి కుటుంబానికి కన్నయ్యు ఉవ్ముడి ఆస్తి. ఈ నాటకవుండలిలోని పొత్తిళ్లలోని బిడ్డ కూడా రంగస్థలమెక్కేది.. వెన్నదొంగ వేషంతోనే. దేవకి పంటగా పుట్టినప్పటి నుంచి.. గోకులంలో చూపిన వూయులు.. బృందావనంలో చేసిన రాసలీలలు.. ద్వారక పాలకుడిగా.. బావ బండి తోలిపెట్టిన సారథిగా.. ఆ నందగోపాలుడి ఆనందలీలలు.. సురభి కళాకారులు వేస్తే చూడాల్సిందే.. వారు చెప్పే ఆ లీలలు వినాల్సిందే.
 
 కావ్యేశు నాటకం రమ్యం అని మహాకవి కాళిదాసు అంటే.. అందులో సురభి నాటకం రసరవ్యుం అంటారు కళాభివూనులు. రావుుడు, శివుడు, విష్ణువు ఇలా సురభికళాకారులు అభినరుుంచని పాత్రలు లేవు. ఇలా ఎన్ని అవతారాలెత్తినా.. జగన్నాటక సూత్రధారి పాత్రంటే
 వారికి ప్రాణం. ఆ గోపాల బాలుడు సురభి ఒళ్లో  ఆడుకునే పసివాడు. ఏటా సువూరు 150కి పైగా కృష్ణావతారాలు ఉంటారుు వారి నాటకాల్లో. అందులో ఓ యూైభె సార్లు కృష్ణలీలలు, ఇంకో వందసార్లు వూయూబజార్ నాటకం కోసం ఆ కళాకారులు నల్లనయ్యును
 ఆవాహన చేసుకుంటారు. అద్భుతనటనా విన్యాసంతో సాక్షాత్త్తూ ఆ పరవూత్ముని కళ్ల ముందుంచుతారు.

సురభి ముంగిట ముత్యం
బారసాల పూర్తరుున వెంటనే సురభి పిల్లలు జీవించేది నాటకంలోనే. అదీ.. కంసుడి చెరసాలలో పుట్టిన పాలబుగ్గల బాలకృష్ణుడి రూపంలో! అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నెలు దొంగిలిస్తూ సురభి బాలల చూపే అభినయుం.. ఆ యుశోదవ్ముకు బాలకృష్ణుడిని జ్ఞప్తికి తెస్తుంది. కాళీయు పడగలపై నాట్యవూడే సన్నివేశం చూస్తే ఆబాలగోపాలం ఆ బాల గోపాలుడిని తన్మయుత్వంతో చూస్తూ ఉండిపోవాల్సిందే.
 
 గోవర్ధన గిరినెతే ్త సన్నివేశానికి గోకులవుంతా దాసోహం కాకతప్పదు. కురుక్షేత్రంలో వీళ్ల విశ్వరూపానికి అసలు కృష్ణుడు సైతం చేతులు జోడిస్తాడేమో.. అదీ సురభి ప్రత్యేకత. కృష్ణుడు వాళ్లకు ఓ పురాణ పురుషుడు కాదు.. వాళ్లింటి బిడ్డ. అందుకే సురభివుూర్తులు శ్రీకృష్ణపాత్రలో అంతలా లీనవువుతారు.

తాడుచ్చుకుని కొట్టింది..
ఈ నటనసూత్రధారి పాత్రను అంతలా పండిస్తున్న ప్రస్తుత సురభి కళాకారులు.. పద్మశ్రీ సురభి నాగేశ్వర్రావు (సురభి బాబ్జి), ఆర్.పద్మజ. ‘మేం నేర్చుకున్న తొలి పద్యం కృష్ణపాత్రదే. నాకు నాలుగేళ్లున్నప్పుడు ‘కృష్ణలీలలు’లో చిన్నికృష్ణుడిగా నటించా. యుశోదగా వూ అవ్ము సుభద్రవ్ము, పూతనగా వూ వదిన నటించారు. పూతన కోసం రాక్షసి రూపంలో ఓ వూస్క్ తయూరు చేశారు. పూతన ఒళ్లో ఉండి పాలు తాగేటప్పుడు ఒక్కసారిగా లైట్లు ఆరిపోతారుు. వుళ్లీ లైట్లు వె లిగే సరికి వూ వదిన రాక్షసి వూస్క్‌లో దర్శనమిచ్చింది. అంతే స్టేజ్‌మీదే పరిగెత్తా. జనాలు అదీ నాటకంలో భాగమే అనుకున్నారు. తెరదించాక.. వూ అవ్ము తాడిచ్చుకుని కొట్టింది’అని గతం గుర్తు చేసుకున్నారు సురభి నాగేశ్వర్రావు.
 
 నారీనారీ.. మెరిసె మురారి
 సురభిలో కృష్ణుడి వేషాలకు సాధారణంగా మహిళలే ప్రసిద్ధి. కాస్త గాంభీర్యం.. ఇంకాస్త నయుగారం.. అంతకుమించి ఒయ్యూరం.. ఇవన్నీ ఆడవాళ్లు అవలీలగా ఒలికించగలరు. అలాంటి కీర్తి సాధించిన ఈ తరం కళాకారిణి ఆర్.పద్మజ. ‘నా చిన్నతనంలో వూ అవ్మువ్ము వేసిన కృష్ణపాత్ర చూసి ఎలాగైనా నేనూ ఆ పాత్ర చేయూలని కలలు కనేదాన్ని. తర్వాత చాలా కాలం ఆ పాత్ర వూ పెద్దనాన్న పోషించారు. అనారోగ్యం కారణంగా ఆయున ఆ పాత్ర వేయులేని పరిస్థితి వచ్చింది. అప్పుడు కృష్ణుడి వేషం వేస్తానని నేను వుుందుకొచ్చాను. విగ్గు.. బరువైన కిరీటం.. ఒంటికి పూసుకున్న నీలిరంగుతో విపరీతమైన వేడి.. ఇవేవీ తెలియునీయుకుండా అభినరుుంచాలి. 1995 నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి వేషం నాదే’ అని తన జ్ఞాపకాలు పంచుకున్నారు పద్మజ. ఒక్క కృష్ణపాత్రే కాదు..  పురాణపాత్రలన్నీ సురభి కుటుంబంలో సభ్యులే. వాళ్ల కష్టసుఖాల్లో భాగస్వావుులే. కళను గుర్తించకపోరుునా.. కనీసం తవు కుటుంబం సాగిస్తున్న సవుష్టి జీవన విధానాన్ని అరుునా గుర్తించాలని కోరుతున్నారు సురభి కళాకారులు.
-సరస్వతి రమ

మరిన్ని వార్తలు