స్వీట్ ఫైట్.. ఇద్దరూ ఇద్దరే..

16 Aug, 2014 00:45 IST|Sakshi
స్వీట్ ఫైట్.. ఇద్దరూ ఇద్దరే..

మీ .. రవి-లాస్య
ఇద్దరూ ఇద్దరే.. టామ్ అండ్ జెర్రీ యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే.. వీళ్ల ప్రోగ్రాం చూస్తే సరిపోతుంది. సెటైర్లతో షో రేటింగ్ పెంచేస్తారు. టైమింగ్‌తో వాళ ్లకు పనిలేదు.  షో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. సందు దొరికితే చాలు ఒకరికొకరు బిస్కెట్ వేస్తారు. బుల్లితెరపై పేలే ఈ మాటల ఫైట్.. వార్ రూమ్‌ను మన ముందుంచుతుంది. ఢీ అంటే ఢీ అంటూ.. సెపరేట్ కెమిస్ట్రీ ఫిక్స్ చేసిన యాంకర్లు రవి-లాస్య. వీళ్ల డిష్యుం ఢిష్యుం ఎలా మొదలైంది. ఎక్కడిదాకా వెళ్లిందో.. వాళ్ల మాటల్లోనే..
 
 ఛీ నీతో షో చెయ్యను అని ఒకరు.. నీ ముఖం చూడాల్సి వస్తుందని ఇంకొకరు ఇలా తిట్టుకుంటూనే మా ఇద్దరి యాంకరింగ్ మొదలైంది. ఆ ఆగడాలు, జగడాలు.. షోలో కొత్తదనం నింపాయి. అలా ఇద్దరం ఫిక్సయ్యాం. ‘నేను పుట్టింది ముంబై. నాకు నాలుగేళ్లున ్నప్పుడు హైదరాబాద్ వచ్చాం. నర్సరీ టు బీటెక్ ఇక్కడే. నేను కొరియోగ్రాఫర్‌ని. ఒక పార్టీలో డ్యాన్స్ నేర్పిస్తుండగా.. ఒకావిడకు నా డ్యాన్స్ నచ్చి హీరో నాగార్జునకు పరిచయం చేసింది. సినిమాల్లోకి రావాలనుందని చెబితే, అందుకాయన ముందు ఇండస్ట్రీ గురించి తెలుసుకోమన్నారు. వీజేగా కూడా చెయ్యగలనని చెప్పాను. అలా మా టీవిలో ‘స్టార్ ఆన్ డిమాండ్’ షోతో యాంకర్‌గా మారాను..’ అని రవి తన ఎంట్రీ గురించి చెప్పాడు.
 
 ‘మాది కడప. స్కూలింగ్, కాలేజ్ అంతా తిరుపతిలోనే. ఎన్‌సీసీలో చురుకుగా ఉండేదాన్ని. ఫైరింగ్‌లో గోల్డ్ మెడల్ కూడా కొట్టాను. దానివల్లే హైదరాబాద్ సీబీఐటీలో బీటెక్ సీట్ వచ్చింది. మొదట్లో ఇబ్బందిపడ్డా.. ఫెయిల్ ట్రాక్ లేకుండా బీటెక్ పూర్తి చేశాను. నా ఫ్రెండ్ జెమిని టీవీ ఆడిషన్స్‌కు వెళ్తూ నన్ను తోడు తీసుకెళ్లింది. అక్కడ నన్ను కూడా ఆడిషన్స్ ఇమ్మన్నారు. ఏదో ఇచ్చేసి వచ్చేశాను. 10 రోజుల తర్వాత జెమిని నుంచి సెలెక్టయ్యానని కాల్ వచ్చింది. జెమినిలో శేఖర్‌తో కలసి ఫస్ట్ షో ‘అంకితం’  చేశాను..’ అని లాస్య తన యాంకరింగ్ కెరీర్ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది.
 
అలా మొదలైంది..
 ‘మా టీవీలో సమ్‌థింగ్ స్పెషల్ కు వీజేగా చేస్తూ హ్యాపీగా ఉంటున్న టైంలో ఈ పిల్ల పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అప్పుడు ఓంకార్ జీనియస్ మూవీ స్టార్టయింది. దాని కోసం ఓ నెల రోజులు లీవ్ పెట్టాను. ఆ టైంలో లాస్య వచ్చి షో లీడ్ చేసింది. ఏకై వచ్చి మేకవ్వడమంటే ఇదేనేమో. నెల రోజులు దాటినా నన్ను పిలవరే.. ఓ రోజు నేనే వెళ్లి.. టాలెంట్ వున్నా అబ్బాయిలను పట్టించుకోరా.. ఇలాగైతే నాగార్జున గారికి  చెప్తానని గోల చేసే సరికి..  లాస్యకు నాకు ఆల్టర్‌నేటివ్ డేస్‌లో షో ఇచ్చారు.. శని,ఆదివారాల్లో ఇద్దరం కలసి యాంకరింగ్ చేసేవాళ్లం..’ అని సమ్‌థింగ్ స్పెషల్ గురించి చెప్పుకొచ్చాడు రవి.
 
 ‘వీకెండ్ షోస్ చేస్తున్నప్పుడు ఫస్ట్‌లో బాగా తిట్టుకునేవాళ్లం. వారంలో ఐదు రోజుల టీఆర్‌పీ ఒక ఎత్తు..  చివరి రెండు రోజల టీఆర్‌పీ ఇంకో ఎత్తు. ఇంకేముంది రోజూ ఇద్దరు కలసి చేయమని చెప్పారు. ఇద్దరం కలసి 550కి పైగా షోస్ చేశాం. మొదట్లో మా ఇద్దరి మధ్య సీరియస్ వార్ జరిగినా.. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం. అయినా తిట్టుకోవడం మానలేదు. స్క్రీన్ మీదే కాదు, బయట కూడా మా మాటల యుద్ధం ఆగదు’ అని వార్ జోన్ విశేషాలు మనకందించింది లాస్య.
 
 నో ఇగో ప్రాబ్లమ్స్
 ‘మా ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ లేవు. కాస్త ఎక్కువగానే డామినేట్ చేస్తుంటాడు.  కానీ, నేను మాట్లాడలేనప్పుడు తను లీడ్ తీసుకుంటాడు. ఓవర్ అయితే.. బ్యాలెన్స్ చేద్దామని కాంప్రమైజ్ చేస్తాడు. తను డామినేట్ చేస్తున్నాడు అని కూర్చుంటే ఆగిపోతాం. అయినా వాడిచ్చే పంచ్‌లకు ఆన్సర్ ఇవ్వడం కన్నా.. సెలైంట్‌గా ఉండటమే బెటర్’ అని ఇద్దరి సక్సెస్ సీక్రెట్ రిలీవ్ చేసింది లాస్య.
 
 మేమేంటో నిరూపించుకోవాలి..
 రవి బాగా తిట్టినా మంచి కేరింగ్ పర్సన్ అని లాస్య కితాబిస్తే.. మేం బెస్ట్ ఎనిమీస్ అని పంచ్ ఇస్తాడు రవి. లాస్యకు అసలు యాంకరింగే రాదంటూ గేలి చేస్తాడు. ‘లాస్య లేకపోతే రవి చేయలేడు.. రవి లేకపోతే లాస్యకు నోరు పెగలదు అని కూడా అంటుంటారు. ఆ ఒపీనియన్ బ్రేక్ చేయాలి. లాస్య లేకున్నా రవి.., రవి లేకపోయినా.. లాస్య అదరగొడతారని నిరూపించుకోవాలి. అందుకో సోలో షో చేయాలని ఉంద’ని ఇద్దరూ అభిప్రాయపడుతున్నారు.
 
వెండితెర వైపు..
 బుల్లితెర మీద తామేంటో నిరూపించుకున్న ఈ ఇద్దరూ.. సినిమాల్లోనూ కనిపించాలని కోరుకుంటున్నారు. ‘సింపుల్ లవ్‌స్టోరీ, చిన్న సినిమా అయినా చెయ్యాలని ఉంది. లేదా పవన్, మహేష్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌అయినా చేస్తాను’ అని లాస్య తన ఇష్టాన్ని బయటపెడితే.. ‘ సినిమాల్లో హీరోగా చేయడమే తన లక్ష్యమ’ని ఫినిషింగ్ ఇచ్చాడు రవి.
 - ఓ మధు
 ఫొటోలు: రాజేష్ రెడ్డి

మరిన్ని వార్తలు