గీత స్మరణం

25 Jul, 2013 04:53 IST|Sakshi
గీత స్మరణం
 పల్లవి :
 ఓ బేబీ యు ఆర్ బ్యూటిఫుల్
   ఓ ఓ తరార తరార తరార
 నిన్నే నిన్నే నే చూస్తూవుంటే
 నన్నే నన్నే నే మరిచానే
 నీ అందమే నాలో ఏదో రేపే
 నీ కళ్లలో ఏదో మైకముందే
 ఇలా ఏనాడు లేదే...
   హో... ఏంటో తెలీదే
 నా కళ్లలో చేరి... నా గుండెలోకి జారి
 మాయేదో చేసినావులే
 ఓ బేబీ ఓ బేబీ ఐ వాంట్ యూ
 ఓ బేబీ ఓ బేబీ ఐ నీడ్ యూ
 ఓ బేబీ ఓ బేబీ ఐ వాంట్ యూ... ఓ...
 
 చరణం : 1
 
 హో... డిస్టర్బ్ చేశావే నన్ను కన్‌ఫ్యూజ్ చేశావే
 చిన్ని హార్ట్‌బీట్ పట్టి పట్టి ఆపి చూడకే
 నన్ను హాట్ హాట్ ఊహలోకి జారనివ్వకే
 హలో... పిల్లో నువ్వేదో... హో... విన్నావో లేదో
 ఈ జోరు నాది కాదు... ఈ హోరు నిన్న లేదు...
 ఈ కొత్త తీరు ఏమిటో... ॥బేబీ॥
 
 చరణం : 2 
 
 ఓ... జాదూ చేశావే వింత హాయే చూపావే
 కొత్త లోకమేదో కళ్ల ముందు వాలుతున్నదే
 నిన్ను నాకు ఎంతో కొత్తగాను చూపుతున్నదే
 కల్లో ఉన్నాను ఏమో ఓహో... నీవల్లనేమో
 వింత ఆలోచనలు నా గుండెలోన కలిగే... ఏ మత్తు జల్లినే
 ॥బేబీ॥
 
 రచన : శ్రీమణి, గానం : నిఖిల్ డిసౌజా
 
 
 పల్లవి :
 ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే... ఏం చేస్తున్నా నీ ఊసే
 ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే
 వేచింది నీకోసమే... నే కోరింది నీ క్షేమమే
 ఇదే ఇదే ప్రేమంటే... ఎలా ఎలా నమ్మేదే
 ఇవన్నీ ప్రతిబంధంలో ఉన్నాయి ఇంతకు ముందే
 అదో ఇదో తేలేదెలా... ఓహో...
 ॥
 
 చరణం : 1 
 
 ఎప్పటినుంచో చూస్తున్నా
 ఎందరినో గమనిస్తున్నా
 అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
 ఏమో నాకే నాపైనే నమ్మకమింక రాలేదే
 నీపై ఇష్టం ఎంతున్నా... ఏం చేస్తా
 అయినా ఎందుకో మనసే ఒప్పదే
 పోనీ ఆ నిజం నీతో చెప్పదే
 అయోమయం పోయేదెలా... ఓహో...
 
 చరణం : 2 
 
 రేపోమాపో నావల్లే నీకేమీ కాకూడదని
 ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
 ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
 దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
 నాలో ఉన్నది స్పష్టం కానిదే
 నువ్వేం చేసినా ఎలా ఆపనే
 లోలో నిజం తెలిసేదెలా... ఓహో...
 
 రచన : అనంత శ్రీరామ్, గానం : విజయ్ ప్రకాష్
 చిత్రం : అడ్డా (2013), సంగీతం : అనూప్ రూబెన్స్
 
మరిన్ని వార్తలు