టిబెట్ స్వేచ్ఛాగానం

26 Aug, 2014 01:03 IST|Sakshi
టిబెట్ స్వేచ్ఛాగానం

నిషిద్ధ ప్రాంతంగా మారిన మాతృభూమికి వెళ్లేందుకు సరిహద్దులు దాటిన కవి అతడు. సరిహద్దులకు ఆవల తన మాతృభూమి దుస్థితిని కళ్లారా చూసి చలించి, స్వేచ్ఛాగానాన్ని ఎలుగెత్తి వినిపిస్తున్న కవి అతడు. భారత్‌లో స్థిరపడ్డ ప్రవాస టిబెటన్ల కుటుంబంలో పుట్టాడు టెన్జిన్ సన్‌డ్యూ. చదువు సంధ్యలన్నీ భారత్‌లోనే. చెన్నైలో చదువు పూర్తి చేసుకున్నాక, మిత్రుల నుంచి సేకరించిన విరాళాలతో స్వస్థలమైన టిబెట్ వెళ్లాడు. చైనా సరిహద్దు పోలీసులకు పట్టుబడి, లాసా జైలులో గడిపాడు. చైనా పోలీసులు అతడిని తిరిగి భారత్‌కు పంపేశారు. టిబెట్ స్వేచ్ఛ కోసం విద్యార్థి దశ నుంచే టెంజిన్ కవిత్వం రాస్తున్నాడు. టిబెట్ స్వేచ్ఛా పోరాట కార్యకర్తగా పనిచేస్తున్నాడు. దేశ విదేశాల్లో విరివిగా కవితా పఠన కార్యక్రమాల్లో పాల్గొంటున్న టెన్జిన్, సోమవారం హైదరాబాద్ వచ్చాడు. అవర్ సేక్రెడ్ స్పేస్‌లో తన కవిత్వాన్ని వినిపించాడు. టెన్జిన్ స్వేచ్ఛాగానాన్ని ఆలకించిన శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు.
 - సాక్షి, సిటీప్లస్

>
మరిన్ని వార్తలు