పుట్టింది ఎందుకో తెలిసింది వీళ్లకి

10 Nov, 2014 23:25 IST|Sakshi
పుట్టింది ఎందుకో తెలిసింది వీళ్లకి

పుట్టిన రోజు పండుగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసే సరికి ఏజ్ బార్ అయిపోతుంది. ఎంజాయ్‌మెంట్ తప్ప మరొకటి తెలియని ఈ యూత్‌కు మాత్రం పుట్టింది ఎందుకో ఇప్పుడే తెలిసింది. పుట్టిన రోజు వేడుకను డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటూ పెరుగుతున్న వయసుకు అర్థం చెబుతున్నారు.

బర్త్ డేని పార్టీలతోనే  వెళ్లదీయకుండా.. పదిమందికీ సాయం చేస్తూ నలుగురు నచ్చే విధంగా జరుపుకుంటున్నారు. తమ పుట్టిన రోజును కాస్త డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం అంటున్న సోమాజిగూడలోని రూట్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు.. ఆ విశేషాలను క్యాంపస్ కబుర్లలో పంచుకున్నారు.


భువనేశ్వరి
 
ఆయుష్
: నవంబర్ 16 నా బర్త్‌డే.. వెరీ స్పెషల్ డే. ఆ రోజు నేను లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గరున్న గోశాలకు వెళ్తాను. ఆవులకు ఇష్టమైన దాణా తీసుకెళ్లి నా చేతులతో వాటికి పెడతాను.  అక్కడే చాలా టైం గడుపుతాను. సాయంత్రం ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్.
అవ్ని: ఓ వావ్.. రియల్లీ యువర్ గుడ్. ఓకే..నా బర్త్‌డే జూన్ 28.
ఆశిష్: మేడమ్ ఇయర్ కూడా చెప్పాలి.
అవ్ని: థ్యాంక్స్ ఫర్ ద సజేషన్. నో వే. నేను మాత్రం బర్త్‌డే రోజు పొద్దున్నే గుడికి వెళ్తాను. లాస్ట్‌టైం గుడి దగ్గరున్న బెగ్గర్స్‌కు పళ్లు, స్వీట్లు పంచాను. ప్రతిసారీ ఇలాగే అని కాదు. ఒక్కోసారి ఒక్కోలా ప్లాన్ చేసుకుంటాను.
ఆశిష్: నో పార్టీ..నో ఎంజాయ్.
అవ్ని: చెప్పా కదా.. అప్పటికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను.

ధనలక్ష్మి అగర్వాల్: నేను మాత్రం బర్త్ డే సెలబ్రేషన్స్‌కు వ్యతిరేకం. ఎందుకంటే మన జీవితంలో ఒక ఇయర్ లాస్ అయిన రోజు అది. అలాగని ఆ రోజు నేను మూడీగా ఏమీ ఉండను. మా ఇంటికి దగ్గరగా ఉన్న చారిటీ హోమ్‌లో స్వీట్లు పంచుతాను. అలాగే దీపావళి పండుగ రోజు కూడా నేను ఇంట్లో ఉండను. స్వీట్లు పట్టుకుని ఆశ్రమాలకు వెళ్లిపోతాను.

నవ్య: సో గుడ్. అంతకు మించి సెలబ్రేషన్ ఏముంటుంది ధనలక్ష్మి. జూలై 5 నా బర్త్‌డే. నేను నా బ్రదర్‌తో స్నేహితులను తీసుకుని కేఎఫ్‌సీకి వెళ్లాను. బండి పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే అక్కడే గోడ పక్కన చిరిగిపోయిన బట్టలతో ఓ పెద్దాయన కనిపించాడు.

నేను దగ్గరికెళ్లి డబ్బులిస్తుంటే తీసుకోలేదు. అన్నయ్య తన జర్కిన్ ఇస్తుంటే వద్దన్నాడు. ఏం కావాలని అడిగితే అన్నం అన్నాడు. ముందు అతని కోసం ఆర్డర్ చేసి తర్వాత మేం తిని ఇంటికి వచ్చాం. నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

ఎమ్మెస్ పల్లవి: అఫ్‌కోర్స్.. ఎంజాయ్‌మెంట్ మహా అయితే రోజుల జ్ఞాపకమే. కానీ ఇలాంటి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేను మా ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ కొనిపెడుతుంటాను.

ఆదిత్య: యా.. ఆ రోజుకే కాదు, ఆ రోజు చేసిన పనికి కూడా స్పెషల్ మెమొరీ ఉంటుంది. మా ఇంట్లో మేం ట్విన్స్. చెల్లి ఐశ్వర్య నేను జనవరి 19న గ్రాండ్‌గా బర్త్‌డే చేసుకుంటాం. అమ్మానాన్న, బాబాయి అందరూ మాకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తారు. మొన్నటిసారి ఇంట్లో సెలబ్రేషన్స్‌తో పాటు డెఫ్ అండ్ డమ్ స్కూల్‌కు వెళ్లి స్వీట్లు పంచాం. నిజానికి ఇలా ప్రతిసారి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్‌కి అందరికీ ఇలాంటి ఆలోచనలున్నాయి.  

నవ్య: యా.. ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు.
ఆదిత్య: ఆలోచన వస్తే చాలు.. మన పుట్టినరోజు వేడుక పేదవాడి జీవితంలో వెలుగులు నింపే వేదికగా మార్చే ఐడియాలు బోలెడు వస్తాయి.
సత్యం: పార్టీలు, పబ్‌లు, ఎంజాయ్‌మెంట్‌లు ఎప్పుడైనా ఉంటాయి కదా! బర్త్‌డే.. అనేది మనతో పాటు మన ఇంట్లోవాళ్లకి కూడా స్పెషల్ కదా.
ఆదిత్య: డెఫినెట్లీ.. వాళ్ల ఏర్పాట్లు వారికుంటాయి. మా ఇంట్లో అయితే రాత్రి పన్నెండింటికి కేక్ రెడీ చేసేస్తారు. గిఫ్ట్‌లు కూడా రెడీ చేసి ఉంచుతారు.
అవ్ని: నాకు ఈసారి మా డాడ్ ఆక్టీవా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇచ్చే సర్‌ప్రైజ్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
ఆశిష్: ఓ.. గ్రేట్ ఈసారి నీకెన్ని గిఫ్ట్‌లు వచ్చాయి అవ్ని.
అవ్ని: నో.. చెప్పను.
సత్యం: నా బర్త్‌డే ఫిబ్రవరి 1. ముందు గుడికి వెళ్తాను. తర్వాత ఓల్జేజ్ హోమ్‌కు వెళ్లి అక్కడే కొంత టైం స్పెండ్ చేస్తా. సాయంత్రం ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్తాను.
సుదీప్తి: నేనైతే నా ప్రతి బర్త్ డే రోజు ఓ మొక్క నాటుతాను.
శశి: వావ్.. మీ ఇంట్లో ఎన్ని చెట్లున్నాయి.
సుదీప్తి: 23.
ఆశిష్: ఓ.. నీ ఏజ్...
సుదీప్తి: నో ఇట్స్ నాట్ మై ఏజ్. నేను ఒక్కోసారి రెండు మూడు చెట్లు కూడా నాటుతాను. ఎనీ వే ఈ సందర్భంగా నేను అందరికీ ఇచ్చే బెస్ట్ సజేషన్. ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటండి.
ఆయుష్: యా.. ఇట్స్ రియల్లీ గుడ్ ఐడియా. నీడ్ ఆల్సో.

మరిన్ని వార్తలు