ఆలోచింపజేసే రేపేంటి?

12 Jun, 2015 23:42 IST|Sakshi
ఆలోచింపజేసే రేపేంటి?

పర్యావరణాన్ని కాలుష్యం చేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? పాలిథిన్ కవర్ల బదులు పేవర్ కవర్లు వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కాకుండా మట్టితో చేసిన వినాయకులే ఎంతో మేలని.. ఇంకుడు గుంతలు ఉపయోగకరమని.. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆత్మహత్యలు ఉండవని అంటున్నారు సొసైటీ ఫర్ అవేర్‌నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్(సేవ్) సంస్థ ప్రతినిధులు. ప్రతి ఒక్కరూ నేల తల్లి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రాం.

సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన రేపేంటి? ఎంతో ఆలోచింపజేసింది. ప్రకృతి సేద్యం కోసంఅరకిలో వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నామని, పేపరు బ్యాగులు, మట్టి వినాయకులు, సీడ్‌బాల్, ఇంటి పంటపై ఇందిరా పార్కు వద్ద శని, ఆదివారాల్లో కూడా ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తామని విజయ్‌రాం చెప్పారు.     -దోమలగూడ
 
 

మరిన్ని వార్తలు