వియ్ లవ్ ఇండియా

15 Aug, 2014 01:32 IST|Sakshi

నిండు మనసుతో జాతి కోసం కదలడమే నిజమైన జాతీయ పండుగ. నిర్భయంగా ప్రశ్నించడమే స్వాతంత్య్ర సమర యోధులకు మనమిచ్చే నివాళి. స్వదేశీ వస్తు వినియోగాన్ని కోరిన గాంధీ దేశంలో విదేశీ వ్యాపార ధోరణిని నియంత్రించాల్సిందే. ఇందుకు సోషల్ మీడియానే ఉద్యమ వేదికగా చేసుకోవాలి.. ఇదీ ‘గీతం’ యూనివర్సిటీ విద్యార్థుల మనోగతం. పంద్రాగస్టు సంబరాల జోరులో వాడిగా, వేడిగా జరిగిన చర్చలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...
 
 వందన: ఏయ్ అపర్ణా! ఎక్సలెంట్... వాట్ ఏ స్పీచ్... అదరగొట్టావ్. కాకపోతే చిన్న డౌట్?
 అపర్ణ: ఏంటో? నీ కొచ్చిందా.. ఇంకెవరికైనా..
 వందన: తల్లీ నాకే వచ్చింది. సరేనా... నీ స్పీచ్‌లో యూత్‌ను టార్గెట్ చేశావే. ఎందుకు?
 అపర్ణ: అయితే ఉండు.. మన బ్యాచ్ మొత్తం వస్తున్నారు. వాళ్లకేం డౌట్స్ ఉన్నాయో చెప్పనీ... యక్ష ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా.
 కృష్ణకాంత్: అవునమ్మా. స్పీచ్ ఇచ్చావ్. క్వశ్చన్స్ మిగిల్చావ్. స్వదేశీ వస్తువులే వాడాలన్నావ్. అవినీతిని తరిమేయాలన్నావ్. అదే స్వాతంత్య్ర స్ఫూర్తి అని లెక్చరిచ్చావ్. ఆ మార్పు రావడం చెప్పినంత తేలికేంటి?
 సమైక్య:  ఏం గాంధీగారు తేలేదా? అహింసతోనే బ్రిటిష్ వాళ్లను తరిమేయలేదా?
 కృష్ణకాంత్:  హిస్టరీలొద్దమ్మా.  గాంధీగారి స్పిరిట్ మన లీడర్స్‌లో ఉందా? వాళ్లకు లేకుండా మనమేం
 చేయగలం?
 అపర్ణ: అబ్బా... ఏం ఫిలాసఫీ చెప్పావ్. యూత్‌ను అంత తక్కువగా అంచనా వేయకు. ఫేస్‌బుక్‌లో ఒక్క పోస్ట్‌తో ప్రపంచం మొత్తం కదులుతుంది. ట్విట్టర్‌లో ఒక్క మెసేజ్ ఇచ్చి చూడు... దేశం కోసం యూత్ ఎలా ముందుకొస్తారో.
 సాయి నిఖిత: తల్లీ! సోషల్ మీడియా లాజిక్కా... మరి ఓటింగ్ దాకా వచ్చేసరికి యూత్ ఎందుకు దూరంగా ఉంటోంది. అప్పుడు నీ సోషల్ మీడియా ఏమైందో?
 
 గాంధీగారు మన వస్తువులే వాడాలన్నారు. మనమే వస్తువులను ఉత్పత్తి చేయాలన్నారు. కానీ మనోళ్లు మాత్రం గ్లోబల్ వీల్‌లో తిరుగుతున్నారు.
 వందన:  అపర్ణా... అడ్డంగా ఇరుక్కుపోయావా? పాపం జాలేస్తోంది.
 సమైక్య: వందనా... కాస్త తగ్గుతావా? అపర్ణ చెప్పింది హండ్రెడ్ పర్సంట్ రైట్. కాకపోతే యూత్‌కు ఇంకా స్పిరిట్ కావాలి. మరింత ఐక్యం కావాలి. అది ఈ
 జనరేషన్ నుంచే మొదలవ్వాలి.
 గీతిక: ముందు ఈ దేశంలో మహిళలకు రక్షణ ముఖ్యం తల్లీ. స్వాతంత్య్రం వచ్చినా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఇంటికి అరగంట లేటుగా వెళ్తే చాలు... పేరెంట్స్ కంగారు పడిపోతారు.
 హరిప్రియ: ఔను మరి రోజులలా ఉన్నాయి. పూటకో వార్త వింటున్నాం. అర్ధరాత్రి కాదు, పట్టపగలే ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. చట్టాలు కచ్చితంగా అమలు చేస్తే ఈ పరిస్థితి ఉంటుందా? కేసు పెడతారు... ఏళ్ల తరబడి సాగదీస్తారు.
 ఉర్ధువేసిఫ్: అందుకే కదా నిర్భయ చట్టం వచ్చింది.
 హరిప్రియ: వచ్చింది.. వచ్చింది... అయినా
 ఘాతుకాలు ఆగుతున్నాయా?
 అపర్ణ: మనవాళ్లంతా కరప్షన్‌కు అలవాటు పడ్డారమ్మా. అరే... డ్రైవింగ్ లెసైన్స్... పాస్‌పోర్టు... దేనికైనా బ్రోకర్‌ను ఆశ్రయించాల్సిందే కదా. అఫ్‌కోర్స్ ఈ తప్పులో మన భాగస్వామ్యం ఉందనుకోండి. పని జరగాలంటే తప్పడం లేదు.
 మనస్విని: అపర్ణా... ఈ బాధ నీకు నాకే కాదు. చాలామందిలో ఉంది. ఎంతోమంది ప్రాణాలర్పించి సాధించిన ఈ స్వాతంత్య్ర స్ఫూర్తి పక్కదారి పడుతోందని యూత్ అంటూనే ఉన్నారు. మాటలతో కాదు... మనమే ఏదైనా చేయాలి. దేశంకోసం ఐక్య ఉద్యమం చేయాలి. ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి, అందరినీ కలపాలి.
 వందన: నీ ఆలోచన చాలా బాగుంది. అదెలా? ఏం చేస్తే బాగుంటుందని నీ ఉద్దేశం.
 వసుంధర: సోషల్ మీడియానే దీనికోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు. భావాలతో కలిసి వచ్చే యూత్‌ను ఎందుకు ఏకం చేయకూడదు.
 నిఖిత: నిజమే. ఇండిపెండెంట్ డే రోజే మద్యం విక్రయాలను నిషేధించడం కాదు. అన్ని రోజులూ ఇలాగే కట్టడి చేయాలనే మెసేజ్ యూత్ నుంచే పంపాలి.
 గీతిక: ఎవరో... ఎప్పుడో... ఏదో చేస్తారని కాదు... ఇంతమందిమి కలుసుకున్నాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం... మనమే ఓ మంచి పనిచేద్దాం. ఆగస్టు 15 రోజున జెండా ఎగురవేయడమే స్వాతంత్య్రం కాదని, ఉపన్యాసాలు ఇవ్వడమే స్ఫూర్తి కాదని చెబుదాం.
 కృష్ణకాంత్: మంచి ఆలోచనకు వచ్చారు. నేనూ సపోర్టు చేస్తాను.
 
 స్ఫూర్తి రగిలించాలి
 స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించాల్సింది యువతే. విద్యాలయాలు ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. జాతీయ భావాన్ని నింపేందుకు కృషి చేయాలి. మార్కులు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఈ దేశానికి ఏం చేయాలనే ఆలోచనలు అంతే ముఖ్యం. ఆగస్టు 15న జాతీయ పండుగ చేసుకోవడంతోనే సరిపెట్టుకోవడం తగదు.
- ఎన్.శివప్రసాద్, డెరైక్టర్
 - భావన

మరిన్ని వార్తలు