వెల్కమ్ టూ 4జీ

23 Jul, 2014 02:16 IST|Sakshi
వెల్కమ్ టూ 4జీ

కొత్త టెక్నాలజీ సిటీకి సరికొత్త హంగులు దిద్దుతుందనేదే యువత మనోగతం. అయితే నిర్వహణపరమైన అంశాలపైనే వారిలో సందేహాలున్నాయి. 4జీని తేవాలనే యోచనలో 2జీ, 3జీల పనితీరును, దానిపై ఉన్న అవగాహనను అంచనా వేయాలని, లోపాలను సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. అత్తాపూర్ ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్‌లో ఎంబీఏ విద్యార్థుల మధ్య సాగిన డిస్కషన్...
 
 అర్చన: దేవుడా... దేవుడా... డిస్‌కనెక్ట్ అవ్వొద్దు.. అవ్వొద్దు...
 శరణ్య: ఏయ్! అర్చనా.. ఎన్నిసార్లు పిలవాలి! కాఫీ కొస్తావా? ఇక్కడ అంతా వెయిటింగ్.
 అర్చన: థ్యాంక్ గాడ్... ఇప్పుడు చెప్పు.
 శరణ్య: ఏం చేస్తున్నా....వ్?
 అర్చన: త్రీజీ తల్లీ.. త్రీజీ.. నా ఖర్మకొద్దీ హాఫెనవర్ నుంచి కనెక్ట్ అవడం... డిస్ కనెక్ట్ అవడం. మా అంకుల్‌కేమో మెయిల్ అర్జంట్.
 శ్రావ్య: రాత్రి నాకూ సేమ్ ప్రాబ్లమ్. అయినా ఇంకెంత కాలంలే. 4 జీ వస్తోంది కదా!
 అశ్వని: వస్తోంది.. వస్తోంది. 2జీ, 3జీకే దిక్కులేదు.
 కీర్తన: ఎందుకలా నెగెటివ్ మాట్లాడతావ్. సిటీ ఇక హైఫై అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి.
 అర్చన: అఫ్‌కోర్స్.. 4జీ తేవడం మాటలు కాదు. వర్క్‌లో సిన్సియారిటీ ఉండాలి. డొమొయిన్స్ మార్చాలి. వాటికి పర్మిషన్స్ కావాలి. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవ్వాలి.
 నిఖిల: ఎస్..ఎస్.. కనెక్టివిటీలో ఉండే సమస్యలు కూడా ఆలోచించాలి. వాటిపై పబ్లిక్ సర్వే చేస్తే బాగుంటుంది. దీనివల్ల గుడ్ సజెషన్స్ వస్తాయి.
 ప్రదీప్: అవన్నీ ఆలోచించే ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త టెక్నాలజీని వెల్‌కం చేయాల్సింది యూతేనవ్మూ!
వంశీ: ఆహాహా... ఏం సెలవిచ్చారు సార్! స్పీచ్ అదుర్స్. కాకపోతే అంత స్పీడ్‌లో మన వాళ్లు వెళ్తారా? ఇప్పటికీ ప్రభుత్వాఫీసుల్లో క్రీస్తు పూర్వం సర్వర్లు. జీవిత కాలం నెట్ ముందున్నా పబ్లిక్ సైట్స్‌కు కనెక్ట్ అవ్వలేం.
 చతుర్వేది: కరెక్ట్. లోకం మొత్తం విండోస్ 8 వరకూ వెళ్తే.. మన గవర్నమెంట్ ఆఫీసులు ఇంకా ఎక్స్‌పీ నుంచి బయటపడలేదు. ఇదేనా స్పీడ్.
 మనోజ్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి వైఫై... హై ఫై అంటున్నారు. ప్రాపర్ విజన్ మాత్రం ఉన్నట్టు లేదు. ఎంతమంది 4జీ యూజ్ చేస్తారు. అసలు 2జీ గురించి పూర్తిగా తెలియకుండానే 3 జీ వచ్చింది. 3జీ ఫోన్స్‌ను కనీసం ఆపరేట్ చేయలేని వాళ్లు మన ఇళ్లల్లోనే లేరా?
 శ్రీలక్ష్మి: అంటే ఏంటి నీ ఉద్దేశం. అమ్మలు, నాన్నలకు కూడా 4జీ వాడకం తెలిశాకే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలా?
 శ్రావ్య: ఎందుకే అంతదూరం ఆలోచిస్తున్నారు. 4జీ రావాలంటే కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఇన్‌స్టలేషనే కనీసం వన్ ఇయర్ పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ లింక్ అవ్వడానికి.. చాలా టైం కావాలి. అప్పటిలోగా మనోళ్లు అన్నీ నేర్చేసుకోరంటావా?
 అర్చన: త్రీజీ వచ్చినా మన ట్రాఫిక్ వాళ్లు ఏం చేస్తారు? చౌరస్తాలో నిలబడి కెమెరాతో ఫొటోలు తీస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో కనెక్ట్ చేయడం మరో ప్రాసెస్. సిటీ మొత్తం సీసీ కెమెరాలున్నాయి కదా... వాటినే నేరుగా ఆన్‌లైన్‌కు కనెక్ట్ చేయొచ్చు కదా... అంటే త్రీజీనే మనం సరిగా యూజ్ చేసుకోవడం లేదని తెలిసిపోతోంది కాదా?
 నిఖిల: ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ గవర్నమెంట్‌కు సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం అవసరమవుతోంది.
 కీర్తన: దాంతో బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది.
 ప్రదీప్: బిల్లు నిర్ణయించేది ట్రాయ్ అమ్మా! లివింగ్ స్టాండర్డ్స్‌ను బట్టి చార్జింగ్ ఉంటుంది.
 శ్రావ్య: అదే, హైదరాబాద్‌లో లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయని నిక్కచ్చిగా ఎలా చెబుతారు. ఏవేవో లెక్కలేస్తే ఎలా? దాన్నే బేస్ చేసుకుని బిల్లు వేస్తే ఎలా?
 ప్రదీప్: ఇలా అంటే ప్రోగ్రెస్ ఎలా? ఆధునిక పరిజ్ఞానం ఉంటేనే కదా... మన హైదరాబాద్‌కు ఇండస్ట్రీస్ వచ్చేది? అలా వస్తేనే కదా ఎంప్లాయ్‌మెంట్ సమస్య తీరేది? ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు?
 తేజస్వీ: ఏదేమైనా 4జీని వెల్‌కమ్ చేయాల్సిందే. కానీ, దాని ఉపయోగం ఏమిటి? ఎలా ఉపయోగంలోకి తేవాలనే విషయంలో అన్ని వర్గాలతోనూ ప్రభుత్వం చర్చలు జరపాలి. ముఖ్యంగా ఇందులో యూత్‌ను భాగస్వామ్యం చేయాలి.
 
 కట్టడి అవసరమే
మహానగరాన్ని వైఫై సిటీగా మార్చాలనే ఆలోచన మంచిదే. కాకపోతే కొన్ని సైట్స్‌పై కట్టడి అవసరం. ప్రభుత్వం దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి. లేకపోతే సైబర్ క్రైం రేటు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
 - ప్రొఫెసర్ ఎస్ జరార్
 డెరైక్టర్, ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్
 -  వనం దుర్గాప్రసాద్
 ఫొటోలు: ఠాకూర్

మరిన్ని వార్తలు