అవును... కుఛ్ భీ హో సక్తా హై!

2 Aug, 2013 00:21 IST|Sakshi
అవును... కుఛ్ భీ హో సక్తా హై!

నవ్వించగలడు. ఆ నవ్వు పెదాల మీది నుంచి తప్పుకోక ముందే ఏడిపించగలడు. విలనిజం అంటే ఇది... అని వీజీగా  చూపగలడు. అనుపమ్ ఖేర్ తన నటనతో ఏమైనా చేయగలడు...ఇంకా ఇంకా ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నప్పుడు రంగస్థలంపైకి  వస్తాడు. తన నటవిశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపెడతాడు. నాటకం ద్వారా తన నటనలోని పచ్చదనాన్ని సదా కాపాడుకుంటాడు. తన ఆత్మకథ ఆధారంగా రూపుదిద్దుకున్న నాటకం  ‘కుచ్ భీ హో సక్తా హై’ మూడువందల షోలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్  ఆ షో గురించి చెప్పిన మాటలు....
 
     ముంబాయిలో పని కోసం వెదుక్కునే రోజుల్లో ప్రముఖుల జీవితచరిత్రలు విపరీతంగా చదివేవాడిని. అవి చదువుతున్న క్రమంలో ఏదో  ఆశ కొత్తగా మొలకెత్తేది. నేను గమనించిన విషయం ఏమిటంటే సెకండ్ హాఫ్‌తో పోల్చితే ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా ఉండేది.
     నా జ్ఞాపకాలకు అక్షరరూపం ఇవ్వాల్సిందిగా పెంగ్విన్ వాళ్లు అడిగారు. అలా నా జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, నా ఆలోచనలను సంకలనం చేశాను. ఆటోబయోగ్రఫీ రాస్తున్నప్పుడే దాన్ని నాటకంగా ప్రదర్శించాలనుకున్నాను. అదే విషయాన్ని పెంగ్విన్ వాళ్లకు చెప్పాను.
 
 చెప్పడం తేలికే. చేయడం ఎంత కష్టమో కదా!
 టేబుల్ దగ్గర  కూర్చొని నా కథను అయిదారుమందికి చెప్పడం తేలికే. ఎలా చెప్పినా వాళ్లు మొహమాటానికి వినొచ్చు. కానీ అదే కథను వేలాదిమంది ప్రేక్షకులను కదిలించేలా చెప్పడం అనేది కష్టం. దీని సంగతి ఎలా ఉన్నప్పటికీ నాటకం నాలోని నటుడుని సజీవంగా ఉంచింది.
     జీవితం అనేది ఎప్పటికప్పుడు ఆశ్చరపరిచే ఘటనల సమాహారం.  ఈ భావాన్ని ప్రతిబింబించేలా మా ‘ప్లే’కు ‘కుచ్ భీ హో సక్తా హై’ అని పేరు పెట్టాం.  వేరు వేరు ప్రదేశాల్లో, ప్రేక్షకుల మధ్య ప్రదర్శించిన ప్రతి సందర్భంలోనూ ఈ ‘షో’ నాకు సవాలుగానే నిలిచింది.
     నా యవ్వనంలోని సో-కాల్‌డ్ ఫెయిల్యూర్స్ ఆధారంగా పుట్టిన నాటకం ఇది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ మేలు చేస్తాయని. నా ఫస్ట్ ప్లే, ఫస్ట్ కిస్, ఫస్ట్ రొమాన్స్...అన్నీ ఫెయిల్యూర్‌లే. రెండున్నర గంటల వన్-మాన్ షో అనేది ప్రపంచంలోనే తొలిసారి.
 
     చికాగోలో ఎనభై ఏళ్ల పెద్దాయన ఒకరు నా దగ్గరకు వచ్చి ‘‘మిస్టర్ ఖేర్...నేను జీవించడం మరిచిపోయి చాలా కాలమైంది. నీ షో చూసిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చాను...మళ్లీ జీవించాలనుకుంటున్నాను’’ అన్నాడు. ఇంతకు మించిన అవార్డ్ ఇంకేదైనా ఉందా!
     నేను సినిమా నటుడిని కాబట్టి షో విజయవంతం అయిందనే వాదనను ఒప్పుకోను. ఒకవేళ  ఆ  ఆకర్షణ నిజమైతే... ఒకటి రెండు షోలకు అది పని చేయవచ్చు. మూడు వందల షోలు విజయవంతం అయ్యాయంటే దానికి కారణం అది ‘షో’లో ఉన్న దమ్ము మాత్రమే.
     నన్ను చాలామంది తరచుగా అడిగే ప్రశ్న ఒకటి ఉంది.
 ‘‘ఒక గ్లాసు నీరు కూడా తాగకుండా అలా నాన్‌స్టాప్‌గా ఎలా నటిస్తారు?’’
 ‘‘సుశిక్షితుడనైన నటుడిని నేను’’ అని సమాధానం ఇస్తాను.
 ఒకసారి మిత్రుడిని అడిగాను ‘‘నాటకం మధ్యలో దాహం వేస్తుంది. ఒక గ్లాసు నీళ్లు అందుబాటులో పెట్టవచ్చు కదా’’ అని.
 
 ‘‘మీరు స్టేజిపై నటిస్తున్నప్పుడు  ప్రేక్షకులు పూర్తి స్థాయిలో  దృష్టి సారించి ఉంటారు. మీరు నీళ్లు తాగితే... వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించినవారవుతారు.  ఫీల్ కూడా  పోతుంది’’ అన్నాడు.  నిజమే కదా అనిపించింది.
 
 నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. కొన్ని ‘షో’లు చేసిన తరువాత నాకు అనిపించింది ఏమిటంటే ‘‘షో సజావుగా సాగాలంటే సిగరెట్ మానేయాలని. వెంటనే మానేశాను. అది ఏ రంగం అయినా సరే  ఒక స్థాయికి వెళ్లాలంటే కష్టపడక తప్పదు. ఒకటి సాధించాలంటే మరొకటి త్యాగం చేయక తప్పదు.
 
 నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. కొన్ని ‘షో’లు చేసిన తరువాత నాకు అనిపించింది ఏమిటంటే ‘షో’ సజావుగా సాగాలంటే సిగరెట్ మానేయాలని. వెంటనే మానేశాను. అది ఏ రంగం అయినా సరే  ఒక స్థాయికి వెళ్లాలంటే కష్టపడక తప్పదు. టేబుల్ దగ్గర  కూర్చొని నా కథను అయిదారుమందికి చెప్పడం తేలికే. ఎలా చెప్పినా వాళ్లు మొహమాటానికి వినొచ్చు. కానీ అదే కథను వేలాదిమంది ప్రేక్షకులను కదిలించేలా చెప్పడం అనేది కష్టం. దీని సంగతి ఎలా ఉన్నప్పటికీ నాటకం నాలోని నటుడిని సజీవంగా ఉంచింది. జీవితం అనేది ఎప్పటికప్పుడు ఆశ్చరపరిచే ఘటనల సమాహారం.  ఈ భావాన్ని ప్రతిబింబించేలా మా ‘ప్లే’కు ‘కుచ్ భీ హో సక్తా హై’ అని పేరు పెట్టాం.

మరిన్ని వార్తలు