ఆకాశమే హద్దురా..

2 Feb, 2015 23:52 IST|Sakshi
ఆకాశమే హద్దురా..

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అంటే ఇదేనేమో..! ఓ సినిమాలో కమల్‌హాసన్ ఆడిన ‘ఆకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా..’ అనే పాటను సీరియస్‌గా తీసుకుందే ఏమో ఆన్ స్క్రీన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతానంటోంది కమల్ చిన్న కూతురు అక్షర హాసన్. నటనలో బౌండరీలు పెట్టుకుంటే అనుకున్నది సాధించలేమని బడాయిపోతోంది. అంతటితో ఆగకుండా.. ‘నన్ను నేను ప్రూవ్
చేసుకునేందుకు చాన్స్ వచ్చినప్పుడు నేనెందుకు వెనక్కి తగ్గాలి’ అంటూ తెగేసి చెప్పింది. ఇకముందు సిల్వర్ స్క్రీన్‌పై ఈ ముద్దుగుమ్మ ఎలా చెలరేగిపోతుందో చూడాలి మరి.
 

మరిన్ని వార్తలు