ఆనందాల వెలుగులు నిండాలి

24 Oct, 2019 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటా సందడే...చిన్నా,పెద్ద తేడా లేకుండా టపాసులు కాల్చేందుకు ఉత్సాహం చూపుతారు.  రంగుల వెలుగుల్లో బాణసంచా పేల్చే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా, ఏమరు పాటుగా ఉన్నా ప్రమాదమే. దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కాంతులు వెదజల్లాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆనంద వెలుగులతో దీపావళిపండుగ చేసుకుందాం. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరే ఉంటూ.. జాగ్రత్తలు పాటించాలి 

ఈ జాగ్రత్తలు పాటించాలి  
⇔ టపాసులు కాల్చేటప్పుడు బకెట్‌నీరు దగ్గర పెట్టుకోవాలి.
 రాకెట్లను పెట్రోల్‌ బంక్‌లు, గడ్డివాములకు దూరంగా కాల్చాలి.
 అనుమతి పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి.
 బిగుతుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
 దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తకుండా నేలపైపడుకుని అటు ఇటు పొర్లాడాలి.
 విషవాయువులను పీల్చకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
 నేరుగా అగ్గిపుల్లలు వాడకుండా కొవ్వుత్తులు, 
 అగరవత్తుల సాయంతో టపాకాయలు కాల్చాలి.
 ఇంట్లో కిరోసిన్, గ్యాస్‌పక్కన బాణసంచా ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 ఆస్పత్రులు, న్యాయస్థానం సమీపంలో టపాకాయలు కాల్చకూడదు.
 పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చాలి, చురుగ్గాలేని పిల్లలను దూరంగా ఉంచాలి.
 చేతితో పట్టుకుని కాల్చకూడదు, సగం కాలిన టపాకాయలు తిరిగి వెలిగించేందుకు ప్రయత్నం చేయకూడదు.  
 రాకెట్లు వంటి వాటిని విద్యుత్‌తీగలు, చెట్లు, తలుపులు తెరిచి ఉంచిన చోట కాల్చ కూడదు.
 శ్వాససంబంధిత వ్యాధి బాధితులు బాణ సంచాకు దూరంగా ఉండాలి.

వ్యాపారుల నిబంధనలు ఇవి
దుకాణాల ఏర్పాటుకు అనుమతి పత్రం రెండువారాల వరకే వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత మిగిలిన బాణసంచాను టోకు వ్యాపారులకు  అప్పగించాలి.
⇔ నిల్వ చేసే గోదాములు, ఊరి చివరి ప్రదేశాల్లో ఉండాలి.
⇔ కాగితం తక్కువగా ఉంటే వాటిని విక్రయించకూడదు.
 డ్రమ్ములు, ఇసుకతో నింపిన బకెట్లు, అగ్నినిరోధక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 
⇔ దుకాణాలను అధికారులు సూచించిన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఒక అనుమతి దారుడు 25 కేజీ ల నుంచి 50 కేజీలుమాత్రమే పొటా షియం, నైట్రేట్‌తో కూడిన బాణసంచాను మాత్రమే          విక్రయించాలి.
 దుకాణాల ఏర్పాటులో విద్యుత్‌తీగలకు అతుకులు లేకుండా ఉండాలి. విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి.
 జనసామర్థ్యం, గృహ సముదాయాలు, పెట్రోల్‌బంక్‌ల సమీపంలో టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు.
⇔ వినియోగదారులకు వాటిని కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాలు అందించాలి.
⇔ దుకాణానికి, దుకాణానికి మధ్య 3 మీటర్లు దూరం ఉండాలి. 
⇔ 18 ఏళ్లలోపు పిల్లలను దుకాణంలో పనిలో పెట్టుకోకూడదు.
⇔ దుకాణాల వద్ద అత్యవసర శాఖల 100, 101, 108 నెంబర్ల బోర్డును ఏర్పాటు చేయాలి.

నిబంధనలు పాటించకపోతే చర్యలే
వ్యాపారులు, పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల సూచనలు, నిబంధనలు కచ్చితంగా పా టించాలి. ఆర్డీఓ ఎం పిక చేసిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. అక్రమ నిల్వ ఉంచుకోవడం, అనుమతిలేని ప్రదేశాల్లో విక్రయించడం నేరం. ఎప్పటిలాగా అందరికీ తాత్కాలిక అనుమతి మాత్రమే ఇస్తున్నాం. దుకాణాలు వెదు రు తడికతో కాకుండా ఇనుము, ఆస్‌బస్టాస్‌ రేకులతో నిర్మించుకోవాలి. నకిలీ బాణసంచాపై నిఘా ఉంచాం. అధి కారులు సూచించిన ప్రదేశాల్లోనే ప్రజ లు కొనుగోలు చేయాలి. 
–గజరావు భూపాల్, అర్బన్‌ జిల్లా ఎస్పీ     

కళ్లు జాగ్రత్త
టపాసులు కాల్చే సమయంలో కళ్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసమయంలో కళ్లజోడు ధరిం చడం మంచిది. కం టిలో ఏదైనాపడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకుని డాక్టర్‌ను సంప్రదించాలి. బాణసంచా బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక  ప్రాంతాల్లోనే కాల్చడం వల్ల ప్రమాదాలు అరికట్టవచ్చు.
– డాక్టర్‌ సిద్దానాయక్, రుయా హాస్పిటల్‌ 

పెద్ద శబ్దాలతో చెవికి ప్రమాదం
అధిక శబ్దాలు వచ్చే టపాకాయలు కాల్చడం వల్ల చెవికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. పెద్ద శబ్దం వచ్చే టపాకాయలను కాల్చడం వల్ల పలు అనర్థాలు వాటిల్లుతాయి. వృద్ధులు, చిన్నపిల్లలు వినికిడి సామర్థ్యం కోల్పోయే అవకాశం ఉంది.    
–డాక్టర్‌ అశోక్, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌

పర్యావరణాన్ని కాపాడాలి
బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. సంప్రదాయం కోసం దీపారాధన ఇతరత్రా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేలా బాణసంచా వాడకం తగ్గించడం మంచిది. అదేవిధంగా పండుగకు అయ్యే ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. గతంలో కన్నా తక్కువ ఖర్చు చేసి పొదుపు పటించాలి.  
– చంద్రమోహన్, తహసీల్దార్,చంద్రగిరి
   

Read latest Festival News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు