కవ్వింత: దురాశ

18 Oct, 2014 23:19 IST|Sakshi
కవ్వింత: దురాశ

సుజిత: సంగీత కచేరి ఎక్కడ జరిగినా ఎందుకు అంత ఖర్చు పెట్టి మీ అత్తగార్ని పంపుతావు?
 నయన: సంగీత కచేరి అంటే మా అత్త ప్రాణాలిస్తుందట, అందుకనీ...
 
 కోపం
 ‘‘నీకు నీ భార్య మీద బాగా కోపం వస్తే ఏం చేస్తావ్? చెయ్యి చేసుకుంటావా?’’
 ‘‘లేదు, నా ఒక్కడికే వంట చేసుకుంటాను’’.
 
 అలా అర్థమైందా?
 ఎస్కలేటర్ ఆపరేటర్: ఏంటి సార్ ఎస్కలేటరు దాకా వచ్చి వెనక్కు వెళ్తున్నారు?
 కస్టమర్: ఎస్కలేటరు మీద వెళ్లే వాళ్లు కుక్కను చేత్తో ఎత్తుకుని వెళ్లాలని రాశారు కదా. నా దగ్గర కుక్క లేదు మరి.
 
 ముల్లు
 ‘‘ఇదేమిటయ్యా... అరికాలి నిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయి?’’
 ‘‘మొదట ఒక్క ముల్లే గుచ్చుకుంది డాక్టర్. ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రయత్నించీ...
 
 ఆందోళన
 భార్య: (పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి) సార్, మా ఆయన ఉదయమనగా కుక్కతో పాటు బయటకు వెళ్లారు. నాకేదో భయంగా ఉంది.
 ఎస్సై: ఎందుకమ్మా అంత ఆందోళన?
 భార్య: ఆందోళన అంటారేంటండీ, ఆ కుక్కను ఈ మధ్యే పదివేలు పెట్టి కొన్నాను.  
 
 అదే ఆఖరు
 ‘‘హర్షవర్థనుడు ఏ యుద్ధంలో మరణించాడురా సోమేశ్వర్?
 ‘‘ఆయన చేసిన ఆఖరి యుద్ధంలో సార్’’
 

మరిన్ని వార్తలు